Shipping Ministry changed to Ministry of Ports, Shipping and Waterways: న్యూఢిల్లీ: షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌’గా మార్పు చేయనున్నట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్‌ (Atmanirbhar Bharat) కార్యక్రమంలో భాగంగా దేశంలోని సముద్రతీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిద్వారా సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గుజరాత్‌ ( Gujarat) సూరత్‌లోని హజారియా - భావ్‌నగర్ ఘోఘా మధ్య రోపాక్స్‌ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 370 కి.మీ దూరం 90 కిలోమీటర్లకు తగ్గనుంది. Also read: Haj 2021: హజ్ యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం


ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్‌ శాఖ పేరును మార్చనున్నట్లు వెల్లడించారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాలని ఆయన వివరించారు. అయితే దేశంలో నోట్లు రద్దు చేసి నాలుగేళ్లు నిండిన సందర్బంగా.. ప్రధాని ట్విట్ చేశారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాలను మెరుగుపర్చి.. పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను ప్రధాని ట్విట్ చేశారు.  


Also read: US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe