మిజోరాంలో గెలిచిన ఎంఎన్ఎఫ్.. గవర్నర్తో భేటీ అయిన పార్టీ అధినేత
మిజోరాంలో గెలిచిన ఎంఎన్ఎఫ్.. గవర్నర్తో భేటీ అయిన నేతల బృందం
ఐజ్వాల్: మొత్తం 40 స్థానాలు వున్న మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) పార్టీ 26 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కన్నా ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో ఎంఎన్ఎఫ్ పార్టీ అధ్యక్షుడు జొరంతంగ తమ పార్టీ నేతల బృందంతో కలిసి వెళ్లి ఆ రాష్ట్ర గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్‌ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరారు.
ఇదిలావుంటే, మిజోరాంలో ఇప్పటివరకు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ నేత, ముఖ్యమంత్రి లాల్‌తన్హవ్ల ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు. తాను ఇటువంటి ఫలితాన్ని ఆశించలేదని, ఫలితం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని లాల్‌తన్హవ్ల ఆవేదన వ్యక్తంచేశారు.