అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి
మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హవ్ల ఛాంపాయి సౌత్ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రిపై మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అభ్యర్థి టీజే లాల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మిజోరాం ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 21 స్థానాల్లో భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా ఇప్పటివరకు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలు, బీజేపీ 1 స్థానం, స్వతంత్ర్య అభ్యర్థులు 7 స్థానాల్లో ముందంజలో వున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేత అయిన మిజోరాం ముఖ్యమంత్రి లాల్ తన్హవ్ల ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. అందులో ఒకటి ఛాంపాయి సౌత్ కాగా మరొక నియోజకవర్గమైన సెర్చిప్ నుంచి కూడా ఆయన బరిలో నిలబడ్డారు. సెర్చిప్ నియోజకవర్గం నుంచి జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్పీఎం) ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్డోమపై పోటీ చేశారు. సెర్చిప్ ఫలితం ఇంకా తేలాల్సి వుంది.