మీరు వెళ్తారా .. మమ్మల్ని వెళ్లగొట్టమంటారా..?
మరాఠా ఉద్యమం వేళ్లూనుకున్న మహారాష్ట్రలో మరో ఉద్యమానికి తెరలేవనుందా.. ? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి గతంలో ఇతర రాష్ట్రాల వారిని తరిమికొట్టిన విధంగా.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి.. శరణార్థులుగా ఉంటున్న వారిని మహారాష్ట్ర నుంచి తరిమి కొట్టనున్నారు.
మరాఠా ఉద్యమం వేళ్లూనుకున్న మహారాష్ట్రలో మరో ఉద్యమానికి తెరలేవనుందా.. ? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి గతంలో ఇతర రాష్ట్రాల వారిని తరిమికొట్టిన విధంగా.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి.. శరణార్థులుగా ఉంటున్న వారిని మహారాష్ట్ర నుంచి తరిమి కొట్టనున్నారు. ఇందుకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నుంచి ఓ నాయకుడు ముంబైలో ఏర్పాటు చేసిన ఫ్సెక్సీ పోస్టరే ఉదాహరణగా నిలుస్తోంది.
ముంబైలోని పన్వెల్ ప్రాంతంలో ఈ పోస్టర్ వెలిసింది. మహారాష్ట్రలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదీశీయులారా .. పాకిస్తానీయులా .. మర్యాదగా ఈ దేశం విడిచి పెట్టి వెళ్లండి. లేని పక్షంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చూస్తూ ఊరుకోదు. అందరినీ తరిమి తరిమి కొడుతుందని ఆ ఫ్లెక్సీలో రాశారు. పన్వెల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో MNS చీఫ్ రాజ్ థాక్రేతోపాటు ఆయన కుమారుడు అమిత్ థాక్రే ఫోటోలు కూడా ఉన్నాయి. నిజానికి మహారాష్ట్రలో ఈ నెల 9న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పెద్ద ర్యాలీ నిర్వహించనుంది. ఇంతకు ముందుగానే ఈ పోస్టర్ వెలియడం.. చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే అక్రమ చొరబాటుదారులను తిప్పి పంపిస్తామని కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన స్పష్టం చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం-2019పై చర్చ జరగాలని MNS చీఫ్ రాజ్ థాక్రే అన్నారు. కానీ అక్రమంగా ఇతర దేశాల నుంచి చొరబడిన వారికి ఎందుకు చోటు ఇవ్వాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో మహారాష్ట్రలో మరో ఉద్యమం తప్పదని తెలుస్తోంది.