పూణెలో నవనిర్మాణ సేన వాలంటీర్లు ఓ సినిమా థియేటర్ యజమానిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే పూణెలో ఓ సినిమా థియేటర్‌లో తినుబండారాలను ఎక్కువ రేట్లకు అమ్ముతుండడంతో.. సినిమా చూడడానికి వచ్చిన నవనిర్మాణ సేన వాలంటీర్లు అమ్మకందార్లను ప్రశ్నించారు. అయితే వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో సమస్యను థియేటర్ మేనేజరు వద్దకు తీసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన కూడా సమాధానం సరిగ్గా చెప్పకపోవడంతో.. బండ బూతులు తిడుతూ.. ఆయనను థియేటర్ బయటకు తీసుకువచ్చి కొట్టారు. ఆ తర్వాత పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయమై నవనిర్మాణ సేన ప్రతినిధి మాట్లాడారు.


"బొంబాయి హైకోర్టు తీర్పు ప్రకారం సినిమా థియేటర్లలో తినుబండారాలు ఎక్కువ రేట్లకు అమ్మడం నేరం అని థియేటర్ మేనేజరుకి చెప్పాం. ఆ తీర్పు అన్ని వార్తా పత్రికలలోనూ వచ్చిందని తెలిపాం. కానీ థియేటర్ మేనేజరు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తనకు మరాఠీ రాదని, తాను పత్రికలు చదవనని చెప్పారు. అందుకే ఆయనకు బుద్ధి చెప్పాలని చేయి చేసుకున్నాం" అని తెలిపారు.