Hindustan E Vimarsh in Telugu: మోదీ సర్కార్ 2.0 ఏడాది పాలనపై 21 మంది కేంద్ర మంత్రులతో ఫేస్ టు ఫేస్
Hindustan E Vimarsh in Telugu | మోదీ 2.0 సర్కారులో మోదీ ప్రభుత్వం ఇటీవలే విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచి ప్రధానిగా పగ్గాలు చేపట్టి మే 30కి ఏడాది పూర్తయిన సందర్భంగా ( Modi 2.0 govt in first year) మోదీ 2.0 సర్కారు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు, రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఎంచుకున్న రోడ్‌మ్యాప్ ఏంటి అనే అంశాలపై కూలంకశంగా చర్చించే ప్రయత్నమే హిందుస్తాన్ ఈ విమర్శ్ #HindustanEVimarsh కార్యక్రమం.
Hindustan E Vimarsh in Telugu | మోదీ 2.0 సర్కారులో మోదీ ప్రభుత్వం ఇటీవలే విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచి ప్రధానిగా పగ్గాలు చేపట్టి మే 30కి ఏడాది పూర్తయిన సందర్భంగా ( Modi 2.0 govt in first year) మోదీ 2.0 సర్కారు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు, రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఎంచుకున్న రోడ్‌మ్యాప్ ఏంటి అనే అంశాలపై కూలంకశంగా చర్చించే ప్రయత్నమే హిందుస్తాన్ ఈ విమర్శ్ #HindustanEVimarsh కార్యక్రమం. భారీ సంఖ్యలో స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సహజంగానే బీజేపి నేతృత్వంలోని ఎన్డిఏ సర్కారుపై ప్రజల్లో మునుపటి కంటే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో, ప్రజల ఆశలను, ఆశయాలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ సర్కారు ఎంతమేరకు విజయం సాధించింది ? రాబోయే కాలాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటుందనేది ఈ కార్యక్రమంలో చూద్దాం.
నేడు.. అంటే జూన్ 12న శుక్రవారం ఉదయం 8.55 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు Direct with Ministers అనే కాన్సెప్ట్ పేరిట ఉదయం నుంచి రాత్రి వరకు నేరుగా కేంద్ర మంత్రులతోనే చర్చించి అనేక విషయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకు మీరు చేయాల్సిందల్లా జీ హిందుస్తాన్ టీవీ ఛానెల్లో వారి చర్చా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, మీ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను అందించడమే. ఒకవేళ ఏదైనా కారణాలతో జీ హిందుస్తాన్ టీవీ ఛానెల్‌ని టీవీలో చూడటం కుదరని పక్షంలో ఈ లైవ్ లింకుపై క్లిక్ చేసి నిరంతరాయంగా మీరు జీ హిందుస్తాన్ తెలుగు టీవీ ఛానెల్‌ని వీక్షించొచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మోడీ 2.0 మొదటి సంవత్సరంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లులు, తీసుకున్న కీలక నిర్ణాయల విషయానికొస్తే.. ఆర్టికల్ 370 రద్దు చేయడం, ట్రిపుల్ తలాక్‌ను నేరం కింద పరిగణించేలా చట్టం తీసుకురావడం, ఉగ్రవాద నిరోధక చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో సహా పలు ఇతర కీలక నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి.
ప్రధాని మోదీ 2.0 సర్కారు తొలి ఏడాది ఇన్నింగ్స్‌లో ఇవేకాకుండా ఎన్నో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉన్నాయి. ఎన్నో విజయాలు.. వాటి వెనుక మరెన్నో సంచలన నిర్ణయాలు ఉన్నాయి. అలాగే రాబోయే కాలంలో తీసుకునే సంచలన నిర్ణయాలు ఏంటి ? ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి ఎంత ?.. ఇకపై సాధించబోయేది ఎంత ? అన్నింటికిమించి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనావైరస్‌ని మోదీ సర్కారు ఎలా ఎదుర్కుంటోంది ? రానున్నది మరీ కష్టకాలం కానున్న నేపథ్యంలో ఆ సమస్యను ఎలా అధిగమించబోతోంది అనే ఎన్నో ఆసక్తికరమైన అంశాలకు కేంద్ర మంత్రులు ఏం చెప్పనున్నారనేది హిందుస్తాన్ ఈ విమర్శ్ చర్చావేదికపై చూద్దాం. ఏయే కేంద్ర మంత్రి ఏం చెప్పనున్నారు ? ఆయా శాఖలు, విభాగాల్లో వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఏం చెబుతోందనే విషయాలు తెలియాలంటే.. హిందుస్తాన్ ఈ విమర్శ్ చూస్తూ ఉండండి. Please keep watching #HindustanEVimarsh on Zee Hindustan Telugu. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..