Pak Cricketer: సీఏఏను అమలు చేయాలని కేంద్ర తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ నిర్ణయంతో పాకిస్తాన్లో ఉంటున్న హిందూవులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ హింస వెనుక ఎవరి హస్తం ఉంది ? ఆప్ నేత మద్దతుతోనే అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయా ? రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలకు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఆశ్రయం ఇచ్చారా ? తాహిర్ హుస్సేన్ ఇంటిపైకప్పుపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, ఇటుక పెళ్లలు, సీసాలు ఎందుకున్నాయి ? ఢిల్లీ అల్లర్లలో ఎంత మంది చనిపోయారు ? ఢిల్లీ హింసలో అసాంఘీక శక్తులు ప్రవేశించాయా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు సోమవారం నుంచి మరింత హింసాత్మక ఘటనల వైపు మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నిన్నటి నుంచి జరుగుతున్న ఈ అల్లర్లలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 10 మంది చేరగా 150కిపైగా మంది గాయపడినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)లపై వ్యతిరేక ప్రదర్శనలకు వేదికైంది. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే లేచినిల్చున్న పలువురు ఆందోళనకారులు.. సిఎఎ, ఎన్ఆర్సిలపై వ్యతిరేక నినాదాలు చేశారు.
సీఏఏపై టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలు బాధిస్తున్నాయని, సరైన నిర్ణయం కాదని.. అందరికీ ఒకే విధమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
బీహార్‌లో జాతీయ పౌర పట్టిక (NRC)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తన వైఖరిని స్పష్టంచేశారు. ఎన్డిఏ భాగస్వామి అయిన నితీష్ కుమార్ ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఎఎలపై వారి వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చేసిన డిమాండ్‌కి స్పందిస్తూ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్సీ అంశాలపై చర్చించేందుకు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి గైర్హాజయ్యారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దు ప్రాంతాలపై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు వెంబడి ఉన్న కంచెను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చురలంటించారు. తాను భారత ముస్లిం అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. భారత ముస్లింల గురించి ఆలోచించడం కన్నా పాకిస్థాన్ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం ఉత్తమమని హితవు పలికారు.
ఎంఐఎం పార్టీ నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సైతం కామెంట్లు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆందోళనలను తీవ్రతరం చేసింది. పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చకముందు నుంచే నిరసన తెలియజేస్తున్న ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నుంచి మొదలుకుని పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు, ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకులపై పోలీసుల దాడి ఘటన, తిరుపతిలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం వంటి వార్తాంశాలను ఈ 20-20 వార్తల్లో చూడొచ్చు.
PM Narendra Modi on Thursday slams parties opposing the Citizenship amendment act 2019, and asked why they were silent on the atrocities being done on minorities in neighbouring Pakistan. ''Oppoistion parties including congress are conducting a protest against minorities who are seeking refuge in India'' PM Modi said.
కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం అంటే.. పార్లమెంట్‌కి ఉన్న విశేషాధికారాలను ధిక్కరించినట్టేనని జీవీఎల్ నరసింహా రావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ ఉండదని కేరళ సీఎం విజయన్‌కు జీవీఎల్ గుర్తుచేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, నగర కమిషనర్ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఘాటుగా స్పందించారు. మంత్రి తలసాని శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
పౌరసత్వ సవరణ చట్టం CAA-2019పై దేశవ్యాప్తంగా నిత్యం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చట్టం అమలును అడ్డుకుని తీరుతామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పట్టు వీడడం లేదు.
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమక్రమంగా దేశం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. మొదట ఈశాన్య భారతంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ ఆందోళనలు.. ఆ తర్వాత ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకూ వ్యాపించాయి.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్, అసోం, దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై ప్రధాని ట్వీట్ చేశారు. దేశంలో హింసాత్మక ఘటనలకు తావు ఉండకూడదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.