మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో తన డ్రీమ్ ప్రాజెక్టైన రోరో సర్వీసును (రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీసు) ప్రారంభించారు. నదీ తీరం ద్వారా ప్రయాణికులను గోఘా నుండి దహేజ్ ప్రాంతానికి చేరవేసే ఈ ఫెర్రీ సర్వీసు 8 గంటల ప్రయాణాన్ని కేవలం ఒక గంటకి కుదించడం విశేషం.
6.5 కోట్ల గుజరాతీయుల ఆకాంక్ష ఈ ప్రాజెక్టు ద్వారా నెరవేరిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేయలేదని, అయినప్పటికీ విజయ లక్ష్యాన్ని తమ సర్కారు చేరుకుందని ఆయన చెప్పారు.
పురాణాల్లో తెలియజేసిన క్షీర సాగరమధనమే ఈ ప్రాజెక్టుకి ఆదర్శమని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలోనే తొలిసారిగా ఈ స్థాయి సర్వీసుకు తమ ప్రభుత్వం నాంది పలికిందని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్‌లో ఇంకా మేరీటైమ్ యూనివర్సిటీ మరియు మేరీటైమ్ మ్యూజియం ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.