ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భారత ప్రధాని ప్రసంగించారు. మహిళా సాధికారతను పెంపొందించే ఈ ప్రపంచ సదస్సు భారతదేశంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఈ సదస్సుకు అమెరికన్ ప్రభుత్వం సలహాదారు ఇవాంకా ట్రంప్ రావడం హర్షణీయమని చెప్పారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు మీకోసం..! 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మహిళ ఒక శక్తికి రూపం. నేను మహిళా వికాసం మన వికాసానికి ఆధారమని నమ్ముతాను. 


  • గార్గి, రాణీ లక్ష్మీబాయి, రాణీ అహల్యాబాయి వంటి మహిళలు మాకు ఎంతో ఆదర్శం. 


  • మార్స్ ఆర్బిటర్ మిషను విజయంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా వంటి అమెరికన్ వ్యోమగాములు కూడా భారతీయ సంతతి మహిళలే. 


  • భారతీయ మంత్రులలో కూడా మహిళలకు ప్రత్యేక స్థానం దక్కింది. 


  • హైదరాబాద్ నగరం పివిసింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లాంటి గొప్ప క్రీడాకారిణులకు పుట్టినిల్లు. 


  • గుజరాత్ పాల సరఫరా సంఘం ఆవిర్భావంలో కూడా మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది.  భారతదేశంలో మహిళా కోఆపరేటివ్ వ్యవస్థ వెలుగొందడానికి వారు ఆదర్శప్రాయులయ్యారు. 


  • నేడు మనం బైనరీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. కానీ జీరో పుట్టిందే భారతదేశంలో కదా..!


  • ఇలాంటి సదస్సులు సిలికాన్ వ్యాలీ. హైదరాబాద్ నగరాలనే కాదు. భారత్, అమెరికా మధ్య ఉన్న అనుబంధాన్ని పటిష్టం చేస్తాయి.