PM Modi temple in tamilnadu : ప్రధాని నరేంద్ర మోదీ గుడి ఎక్కడ ఉంది ?
ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాల్లో వీరాభిమానులు ఉన్నారు. వారు అవకాశం దొరికినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారు అభిమానాన్ని చాటుకోవడం చూస్తుంటాం. కానీ ఓ వీరాభిమాని ఏకంగా ఆయన్ను దేవునిలా కొలుస్తున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాల్లో వీరాభిమానులు ఉన్నారు. వారు అవకాశం దొరికినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. ఎవరికి తోచిన విధంగా వారు అభిమానాన్ని చాటుకోవడం చూస్తుంటాం. కానీ ఓ వీరాభిమాని ఏకంగా ఆయన్ను దేవునిలా కొలుస్తున్నాడు. తమిళనాడు తురయ్యూర్ లోని ఏర్కూడి గ్రామానికి చెందిన ఆ వీరాభిమాని పేరు శంకర్. 10 ఎకరాల భూమితో వ్యవసాయం చేస్తున్నాడు. రైతుగా ఆయన ఆర్జించిన దాంట్లో నుంచి కొంత మొత్తం కూడబెట్టి .. ప్రధాని నరేంద్ర మోదీకి గుడి నిర్మించాలని సంకల్పించాడు. ఇందుకోసం కొంత స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు ఈ గుడి కోసం దాదాపు లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేశాడు.
మోదీపై ప్రత్యేక అభిమానం
ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని శంకర్ చెప్పుకున్నాడు. దేశంలో ఆయన తీసుకొస్తున్న పథకాలు తనకు నచ్చుతాయని పేర్కొన్నాడు. పేదల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించాడు. అంతే కాదు తనకు మొన్నటి వరకు మరుగుదొడ్డి లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తనకు అది తీరిపోయిందని తెలిపాడు. తాను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మోదీ కోసం గుడి నిర్మించాలని సంకల్పించినట్లు వివరించాడు. ఇప్పటికే గుడి నిర్మాణం కోసం భూమి పూజ కూడా పూర్తి చేశాడు. త్వరలోనే గుడి నిర్మించి సంకల్పాన్ని పూర్తి పూర్తి చేస్తామని చెప్పాడు.
[[{"fid":"180739","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]