2018 సంవత్సరం ప్రారంభయ్యాక భారత ప్రధాని తొలిసారిగా "మన్ కీ బాత్" రేడియో ప్రోగ్రామ్‌లో దేశ ప్రజలతో తన ఆలోచనలను ఆదివారం పంచుకున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతపై తన ఆలోచనలు పంచుకున్నారు.  అందులోని ఆసక్తికరమైన అంశాలు మీకోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*ఈ రోజు మనం "భేటీ బచావో.. భేటీ పడావో" అంటున్నాం. అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన పురాణాలు ఆ మాటను చెప్పాయి. ఒక్క కుమార్తె పుడితే చాలు.. ఆమే 10 మంది కుమారులతో సమానం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.


*ఈ రోజు మన దేశ పుత్రికలు కల్పానా చావ్లా లాంటి మేటి మహిళా రోదసి నిపుణురాలిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె ఏదీ అసాధ్యం కాదని నిరూపించింది


*భారతదేశంలోని మాతుంగా రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళలే పనిచేయడం మనకు గర్వకారణం. మొత్తం 41 మహిళలు కలిసి ఒక రైల్వే స్టేషన్  నడపడం మాటలు కాదు


*నారీశక్తి భారతదేశంలో ఉన్నతి స్థాయిలో ఉందని నేను నమ్ముతాను. భావనా కంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది లాంటి మహిళలు నేడు ఫైటర్ పైలట్లుగా సుఖోయ్ 30లో శిక్షణ తీసుకుంటున్నారు


*ఒకప్పుడు నక్సల్స్ ప్రభావితమైన ప్రాంతమైన దంతెవాడలో నేడు మహిళలు ఈ రిక్షా కార్మికులుగా పనిచేస్తూ స్వయం ఉపాధి పొందడం విశేషం