Jacqueling Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కష్టాలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు  సమన్లు పంపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ అభినేత్రి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. క్యాన్ మ్యాన్ సుకేశ్ చంద్రశేఖర్‌కు చెందిన 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు పంపించింది. సెప్టెంబర్ 26న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టులో హాజరుకావల్సి ఉంది. ఈ కేసులో ఇటీవల దాఖలైన అదనపు ఛార్జిషీటును కోర్టు స్వీకరించింది. 


జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను బలవంతపు వసూళ్లలో లబ్దిదారురాలిగా ఈడీ భావించింది. సుకేశ్ చంద్రశేఖర్ బలవంతపు వసూళ్లు చేసేవ్యక్తని జాక్వెలిన్‌కు తెలుసనేది ఈడీ చెబుతున్న మాట. ముఖ్యమైన సాక్షులు, ఫిర్యాదుదారుల వాంగ్మూలం ప్రకారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరచూ సుకేశ్ చంద్రశేఖర్‌తో వీడియో కాల్ చేస్తుండేది.



సుకేశ్ చంద్రశేఖర్..జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 10 కోట్ల రూపాయలు బహమతి పంపించాడని ఈడీ చెబుతోంది. ఈడీ ఇప్పటి వరకూ జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్థుల్ని సీజ్ చేసింది. సుకేశ్ చంద్రశేఖర్‌పై చాలా రాష్ట్రాల్లో పోలీసు కేసులు, 3 కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ, ఈడీ, ఐటీ కేసులున్నాయి. 


Also read: CM Kcr: బీజేపీ ముక్త్ భారత్‌ సాధించాలి..ప్రధాని మోదీపై మరోమారు సీఎం కేసీఆర్ ధ్వజం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook