Monkeypox: దేశంలో మంకీపాక్స్ టెర్రర్..తాజాగా వెలుగులోకి కొత్త కేసు..!
Monkeypox: దేశంలో మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఒక్క చోట కొత్త కేసులు వెలుగు చూస్తాయి. తాజాగా ఢిల్లీలో మంకీ పాక్స్ జాడలు కనిపించాయి.
Monkeypox: ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. 31 ఏళ్ల యువకుడికి వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అతడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదు. ఐనా వ్యాధి సోకడంపై తీవ్ర కలకలం రేపుతోంది. జ్వరం, శరీరంపై దద్దుర్లు రావడంతో అతడు ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇప్పటివరకు దేశంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. కేరళలో మూడు కేసులు నమోదు కాగా..తొలిసారి ఢిల్లీలో మంకీ పాక్స్ బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈకేసుల సంఖ్య 16 వేలకు పైగా ఉంది. దాదాపు 75 దేశాల్లో మంకీ పాక్స్ వెలుగు చూసింది. మంకీ పాక్స్ వ్యాధి ..జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఈవ్యాధి లక్షణాలు మనిషిలో ఆరు నుంచి 16 రోజుల్లో బయటపడనుంది.
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. దీనిపై ప్రపంచదేశాలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ఏపీలోనూ కొత్త కేసు నమోదు అయిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఓ బాలుడికి లక్షణాలు ఉన్నాయని..రక్త నమునాలను పుణెకు తరలించారు. నమునాల తర్వాత ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
Also read:Corona Updates in India: దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదా..కలవర పెడుతున్న రోజువారి కేసులు..!
Also read:Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.