COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..
COVID19 Deaths In India Age Wise | కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో మధ్య వయసు నుంచి పెద్ద వయసులో ఉన్న వారే అధికమని సంఖ్య చెబుతుంది. యువతలో కోవిడ్19 మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. వారిలో రోగ నిరోధక శక్తి ఉండటమే అందుకు కారణం.
భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత అధికమైంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశం భారత్. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాను సైతం మన దేశం వెనక్కి నెట్టేస్తుంది. దేశంలో కరోనా మరణాలు (COVID19 Deaths In India) 58,390 కాగా, ఇందులో పురుషులు 69శాతం కాగా, మహిళలు 31శాతం చనిపోయారు. భారత్‌లో ప్రస్తుతం మరణాల రేటు 1.8 శాతంగా ఉంది. SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు
వయసు వారీగా దేశంలో కరోనా మరణాలు ఇలా.. (COVID19 Deaths In India Age Wise):- కరోనా మరణాలను వయసువారీగా చూస్తే 51శాతం మంది 60 లేక అంతకంటే ఎక్కువ వయసు వారు చనిపోయారు. 45 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 36శాతం మరణాలు సంభవించగా.. 26 నుంచి 44 ఏళ్ల వారిలో 11శాతం మరణాలు.. 18 ఏళ్ల వరకు వయసు ఉన్నవారిలో కేవలం 2 శాతం కరోనా మరణాలు సంభవించాయి. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
కరోనా రికవరీ మన దేశంలో ప్రస్తుతం 76 శాతంగా ఉంది. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు కరోనా బాధితులు కోలుకుంటున్నారు. కానీ 45 లేక అంతకంటే ఎక్కువ వయసున్న వారు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే దేశంలో మొత్తం కరోనా మరణాల (covid19 mortality rate in india age wise)లో 87శాతం ఈ వయసువారే ఉన్నారు. అంటే యువతలో చనిపోయే శాతం చాలా తక్కువ అని రిపోర్టులు చెబుతున్నాయి. పెద్ద వయసు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదట్నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాయి. Diabetes Prevention: షుగర్ పేషెంట్స్ అలా నడిస్తేనే ప్రయోజనం
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!