Mother kills 4 years old son in Karnataka Mysore : కన్న కొడుకును ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన తల్లి.. తన చేతులతో కొడుకును చంపేసింది. వేట కొడవలితో కొడుకునే నరికి చంపేసింది ఆ తల్లి. కర్ణాటకలోని (Karnataka) మైసూరు జిల్లా (Mysore District) హెచ్‌డీ కోటె తాలూకాలోని బూదనూరులో ఈ ఘటన జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బూదనూరు గ్రామంలో (Budhanoor village) భవాని అనే మహిళకు కొన్ని ఏళ్ల క్రితం శంకర్‌తో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు శ్రీనివాస్‌ ఉన్నాడు. అయితే భవాని (Bhavani) తనకు కొంతకాలంగా దేవుడు పూనుతున్నాడని చెప్పుకుంటూ వస్తోంది. 


తన ఒంటిపైకి దేవుడు వస్తున్నాడని చెప్తూ.. ఆమె చేసే పిచ్చి చేష్టలను భరించలేక భర్త శంకర్‌‌ కూడా కొన్ని రోజులుగా భవానీకి దూరంగా ఉంటున్నాడు. అయితే 15 రోజుల కింద భర్త (Husband) దగ్గర ఉన్న కొడుకు శ్రీనివాస్‌ను (Srinivas‌) భవానీ తన పుట్టింటికి తీసుకెళ్లింది. 


Also Read : Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్.. ఆలోపు హామీలను నెరవేర్చకపోతే..


అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. తాజాగా రాత్రి పూట తన కన్న కొడుకును వేట కొడవలిలో నరికి చంపింది భవానీ. ఇందుకు గల కారణం తెలియదు. ఇంటికి పక్కన వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. బాలుడు (Boy) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హెచ్‌డీ కోటె పోలీసులు భవానీని అదుపులోకి తీసుకున్నారు. కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Also Read : AP Corona cases: ఏపీలో కొత్తగా 4,348 మందికి కొవిడ్​ పాజిటివ్​- 14 వేలపైకి యాక్టివ్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook