Sherpa Scaled Everest 26 Times: మౌంట్ ఎవరెస్ట్.. ప్రపంచంలోనే ఎత్తైన ఈ శిఖరాన్ని ఎక్కాలన్నది వేలాది మంది పర్వతారోహకుల కోరిక. ట్రెక్కింగ్ చేసే వారు ఎప్పుడెప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదామా అని భావిస్తూ ఉంటారు. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంత సులువైన పని కాదు. ఈ మంచు కొండను అధిరోహించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అలా చనిపోయిన వారి సంఖ్య 2019 నాటికి 300 అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే నేపాల్‌కు చెందిన కమి రిట షెర్పాకు ఎవరెస్ట్ ఎక్కడం ..వెన్నతో పెట్టిన విద్య.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఇప్పటికే 25 సార్లు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన కమి రిట షెర్పా ..తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్నాడు. 26వ సారి ఎవరెస్ట్ ఎక్కి..తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. 8 వేల 849 అడుగులున్న ప్రపంచలోనే ఎత్తైన ఈ శిఖరాన్ని 10 మంది బృందంతో తాజాగా షెర్పా అధిరోహించాడు.


షెర్పా తొలిసారిగా 1994లో ఈ శిఖరం ఎక్కాడు. పర్వతాలు ఎక్కేవారికి తొలి తరం గైడ్‌లలో ఒకరైన ఆయన తండ్రితో పాటు ఎవరెస్ట్‌ పైకి వెళ్లాడు. అప్పుడు అతడి వయసు 28 ఏళ్లు. షెర్పా ప్రస్తుతం విదేశీ పర్వతారోహకులకు ఎవరెస్ట్ ఎక్కడంలో మార్గదర్శకం చేస్తూ ఉంటాడు. ఎవరెస్ట్‌తో పాటు కే-2, మనస్లు, చో-యూ, లోత్సే పర్వతాలను కూడా అధిరోహించాడు.


ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కే-2. దాని ఎత్తు 8,611 మీటర్లు. షెర్పా ఎక్కిన పర్వత శిఖరాల ఎత్తు ఎనిమిది వేల మీటర్ల పై బడి ఉండటం విశేషం.


26వ సారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగానే.. కమి రిట షెర్పా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నేపాల్ ప్రజలు, హిమాలయాలను అధిరోహించే షెర్పా జాతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.


కరోనా కారణంగా మౌంట్ ఎవరెస్ట్‌పైకి పర్వాతారోహకులను నేపాల్ దాదాపు రెండేళ్ల నుంచీ అనుమతించడం లేదు. 2021లో ట్రెక్కింగ్ మొదలైంది. ఈ ఏడాది మొత్తం 918 మంది పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌కు అనుమతి ఇచ్చింది. వీరిలో 300 మందికి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతి లభించింది.


Also Read: Driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకోవాలా ? కొత్త రూల్స్ తెలుసా ?


Also Read: Sedition Law on Hold: రాజద్రోహం చట్టంపై స్టే.. సుప్రీం చారిత్రక తీర్పు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook