Sedition Law on Hold: రాజద్రోహం చట్టంపై స్టే.. సుప్రీం చారిత్రక తీర్పు

Sedition Law on Hold: వివాదాస్పద రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కాలం నాటి ఈ చట్టం పై కేంద్రం పునర్ సమీక్షించే వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసులను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 03:25 PM IST
  • రాజద్రోహం చట్టంపై సుప్రీం స్టే
  • చారిత్రక తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు
  • ఇక బెయిల్ కోరవచ్చు
Sedition Law on Hold: రాజద్రోహం చట్టంపై స్టే.. సుప్రీం చారిత్రక తీర్పు

Sedition Law on Hold: వివాదాస్పద రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కాలం నాటి ఈ చట్టం పై కేంద్రం పునర్ సమీక్షించే వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసులను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.

వివాదాస్పదంగా 124A సెక్షన్

ఐపీసీ సెక్షన్ 124A దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలు, తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పాత్రికేయులను టార్గెట్ చేయడానికి ప్రభుత్వాలు రాజద్రోహం కేసులు పెడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మహాత్మా గాంధీపై ఒకప్పుడు బ్రిటన్ పాలకులు ప్రయోగించిన చట్టాన్ని దేశంలో ఇంకా వినియోగిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఐపీసీ  124A సెక్షన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని ఆదేశించడంతో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాజద్రోహం చట్టం దుర్వినియోగం అవుతుండటం నిజమేనని.. ఈ చట్టాన్ని పునర్ సమీక్షిస్తామని స్పష్టం చేసింది. ఇందుకు కొంత సమయం పడుతుందని కూడా కోరింది. మహరాష్ట్రలో హనుమాన్ చాలీసా.. పఠించినా రాజద్రోహం కేసు నమోదు చేసిన ఉదంతాన్ని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొందన్న సుప్రీం కోర్టు... పునర్ సమీక్షించే వరకు పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది.

రాజదోహ్రం కేసు నమోదు చేసే ముందు ఎస్పీ స్థాయి అధికారి నిర్ణయం తీసుకోవాలన్న ప్రతిపాదనను కేంద్రం  కోర్టు ముందు ఉంచింది. పెండిండ్ కేసులు ప్రస్తుతం కోర్టుల్లో ఉన్నాయనీ.. కొందరిపై ఉగ్రవాదం, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనను పిటిషన్లర తరుపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ప్రస్తుతం దేశంలో 800 రాజద్రోహం కేసులు ఉన్నాయనీ.. 13 వేల మంది జైల్లో ఉన్నారని తెలిపారు. అందుకే ఈ చట్టాన్ని నిలిపివేయాలని కోరారు. పిటిషనర్ల తరుపు వాదనతో ఏకీభవించిన కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

చట్టం దుర్వినియోగం

ఇటీవలే మహరాష్ట్రల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నవనీత్ కౌర్, ఆమె భర్తపై శివసేన ప్రభుత్వం రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయడం వివాదాస్పదమైంది. ఏపీలో ఈ సెక్షన్‌ కింద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై కూడా కేసు నమోదు చేశారు. జగన్‌పై విమర్శలు చేయడం వల్లే రఘురామను టార్గెట్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులపైనా 124A సెక్షన్‌ కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పాత్రికేయుడు వినోద్ దువాపై నమోదైన రాజద్రోహం కేసును సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో 124A సెక్షన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఇక ఈ కేసులో అభియోగాలు మోపబడిన వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తదుపరు విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Also Read:  Cyclone Asani: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్...

Also Read: Tomoto Fever: చిన్నారులపై టమాట ఫ్లూ ప్రభావం, తమిళనాడు కేరళ సరిహద్దుల్లో వైద్యుల పరీక్షలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News