Driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకోవాలా ? కొత్త రూల్స్ తెలుసా ?

Driving licence new rules: డ్రైవింగ్ లైనెస్సె తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే గుడ్ న్యూస్. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి.. అవి ఏవంటే ?

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:48 PM IST
  • డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ వస్తున్నాయ్..!
  • గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
  • సులువు కానున్న డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ప్రక్రియ
Driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకోవాలా ? కొత్త రూల్స్ తెలుసా ?

Driving licence new rules: కారైనా, బండైనా.. లైసెన్స్ ఉంటేనే రోడ్డుపైకి ఎక్కించేందుకు అర్హులవుతారు. ఒక వేళ లైసెన్స్ లేకుండా బండి తీస్తే.. అది శిక్షార్హమైన నేరం. అయితే లైసెన్స్ తీసుకోవడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారం అని చాలా మంది భావన.ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి.. గంటల తరబడి క్యూలలో నిలబడాలి..టెస్ట్ డ్రైవ్ చేయాలని అని భావిస్తూ ఉంటారు. అయితే కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఇలాంటి అవస్థలు తప్పనున్నాయి.

కొత్త రూల్స్

అవునండి... డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ఇకపై లైసెన్స్ కోరుకునే వారు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లనక్కర్లలేదు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్లను సంప్రదిస్తే సరిపోతోంది. ఐదేళ్లకు ఒకసారి ఆ డ్రైవింగ్ సెంటర్లకు ప్రభుత్వాలు లైసెన్సులు ఇస్తాయి. వాటిని రెన్యూ చేయించుకోవాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం.. డ్రైవింగ్ టెస్ట్ కోసం..ఆర్టీవో కార్యాలయాల వద్ద క్యూలలో గంటల తరబడి నిలబలడాల్సిన పని లేదు. ఆర్టీవో కార్యాలయం వద్దే టెస్ట్ డ్రైవ్ చేయక్కర్లేదు. అందుకు బదులుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్‌ వద్దకు వెళితే చాలు. దాంతో లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి సమయం కలిసి రానుంది.

డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

రవాణా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
అక్కడ రాష్ట్రం ఏదో ఎంచుకోవాలి.
ఏ రకమైన లైసెన్స్ కావాలాలో ఎంపిక చేసుకోవాలి
దరఖాస్తు నింపిన తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కాలి
ఒకసారి అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మెయిల్‌ ద్వారా లర్నర్‌ లైసెన్స్‌ వస్తుంది. ఆరు నెలల తర్వాత శాశ్వత లైసెన్స్ మంజూరు చేస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్లు

మీ వయస్సు ధ్రువీకరణ పత్రం- విద్యార్థత సర్టిఫికేట్, బర్త్‌ సర్టిఫికేట్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, లేదా పని చేస్తున్న సంస్థ నుంచి తీసుకున్న సర్టిఫికేట్

అడ్రస్ ఫ్రూఫ్- ఆధార్ కార్డ్, రెంట్ అగ్రిమెంట్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ సర్టిఫికేట్

పాస్‌పోర్టు సైజ్ ఫోటో

ఫామ్‌ 1, 1A మెడికల్‌ సర్టిఫికేట్లు

దేశంలో డ్రైవింగ్ లైసెన్సుల రకాలు

MC 50CC- 50 సీసీ కంటే తక్కువ ఇంజిన్  సామర్థ్యం ఉన్న మోటార్‌ సైకిళ్లు

MC EX50CC-  50 సీసీ, అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌ సైకిళ్లు, కార్లు

MCWOG/FVG- గేర్‌లెస్‌ బండ్లు

M/CYCL.WG - గేర్, గేర్‌ లెస్‌ బండ్లు

LMV-NT - రవాణాకు వినియోగించని లైట్ మోటార్ వెహికిల్స్

ఎప్పటి నుంచి అమలు ?

జూలై 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.

Also Read:  Sedition Law on Hold: రాజద్రోహం చట్టంపై స్టే.. సుప్రీం చారిత్రక తీర్పు

Also Read: Black Turmeric: నల్ల పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News