దారుణం:ప్రేమజంటకు మూత్రం తాగించారు
మధ్య ప్రదేశ్‌లో దారుణం జరిగింది.
మధ్య ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రేమ వివాహానికి ఒప్పుకొని యువతి తల్లిదండ్రులు ప్రేమ జంటను కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దారుణ ఘటన హర్దాస్పూర్లో జరిగింది.
పోలీసుల కథనం మేరకు.. గిరిజన కుటుంబానికి చెందిన ఓ ప్రేమ జంట తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా వివాహం చేసుకుని గుజరాత్‌కు వెళ్లారు. గత వారం దంపతులు ఇక్కడి వచ్చి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు వారిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడం, కొ్ట్టడం, గుండు కొట్టించడం పాటు వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ప్రేమ జంట జరిగిన దారుణాన్ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.