ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ( Ap Government )  గత కొద్దికాలంగా రాష్ట్ర హైకోర్టు ( High court ) నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాజ్యసభలో చర్చకొచ్చింది. న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదంటూ రాజ్యసభలో ప్రస్తావించారు ఎంపీ విజయసాయి రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో న్యాయవ్యవస్థ ( Judiciary ) కు ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పలు నిర్ణయాలపై హైకోర్టు బ్రేకులు వేస్తోంది. ఇప్పుడీ అంశం పార్లమెంట్ పెద్దల సభలో సైతం చర్చకొచ్చింది. రాజ్యసభ ( Rajyasabha ) లో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ( ycp mp vijaysai reddy ) ఇదే అంశాన్ని నేరుగా ప్రస్తావించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వంపై న్యాయవ్యవస్థ పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని..ఈ ధోరణి మానుకోవాలని సభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోందని, మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించిందని సభలో ప్రస్తావించారు. 


అమరావతి భూకుంభకోణం విషయంలో మాజీ అడ్వకేట్ జనరల్ ( Ex Advocate general ) పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రిపోర్టు చేయవద్దంటూ నిషేధం విధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదని, ఈ రకమైన సెన్సార్షిప్ అనేది అసాధారణమైందని చెప్పారు. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ నుంచి ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రం కరోనా నియంత్రణలో ముందంజలో ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ పరిస్థితి ఉండకూడదన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. Also read: AP: భారత్ మిషన్ ప్రధానమంత్రి అవార్డు రేసులో విశాఖ