మేఘాలయలో కాంగ్రెస్ అభ్యర్థి, ఆ రాష్ట్ర సీఎం ముకుల్ సంగ్మా సత్తా చాటారు. అంబటి, సోంగ్ సోక్.. ఈ రెండు ప్రాంతాల నుండి పోటీ చేసిన ఆయన ఆ రెండు స్థానాల్లోనూ గెలవడం విశేషం. ఆయన ప్రస్తుతం మేఘాలయకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1998, 2003, 2008 సంవత్సరాల్లోనే కాకుండా 2013లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కడపటి వార్తలు అందేసరికి.. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నట్లు సమాచారం. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో... 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2013లో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. 2013 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 29 సీట్లు, యూడీపీ 8, హెచ్సీపీడీపీ 4, ఇత‌రులు 19 సీట్లు గెలుచుకోవడం విశేషం.