Mumbai drugs case updates Sameer Wankhede wore ₹70,000 shirt Maharashtra Minister Nawab Malik: బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఈ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర (Maharashtra) నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌పై.. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్ ( Maharashtra Minister Nawab Malik) విమర్శలు చేశారు. ఫడణవీస్‌ చేసిన ఆరోపణలకు నవాబ్ మాలిక్‌ కౌంటర్‌ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవాబ్ మాలిక్‌కు అండర్‌ వరల్డ్‌తో (Underworld) సంబంధాలున్నాయని కొందరు అన్నారని ఆయన పేర్కొన్నారు. గత 62 ఏళ్లుగా తాను ఇక్కడే ఉంటున్నానని.. తనపై వేలెత్తి చూపి.. తనకి అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని చెప్పే ధైర్యం ఎవరికీ లేదని మంత్రి నవాబ్‌ మాలిక్ (Nawab Malik) అన్నారు. ఫడణవీస్‌ (Devendra Fadnavis) మహారాష్ట్ర సీఎంగా పని చేశారని.. అలాగే హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన వద్దే ఉండేదని.. మరి అలాంటప్పుడు దీనిపై ఆయన అప్పుడే ఎందుకు విచారణ జరపలేదని మాలిక్ కౌంటర్ ఇచ్చారు.


Also Read : Huzurabad By Election Result Live Counting: ఎనిమిదో రౌండ్ లీడ్ లోకి వచ్చిన TRS 


అలాగే సమీర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నవాబ్‌ మాలిక్. డ్రగ్స్‌ కేసు (Drugs‌ case) వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడేపై మంత్రి నవాబ్‌ మాలిక్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సమీర్ వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారంటూ తాజాగా మంత్రి నవాబ్‌ మాలిక్ ఆరోపించారు. సమీర్ వాంఖడే (Sameer Wankhede).. రూ.లక్ష విలువైన ట్రౌజర్, రూ.70 వేల విలువైన చొక్కా, 25 నుంచి 30 లక్షల విలువైన చేతి గడియారాలు ధరించారని గుర్తు చేశారు మంత్రి నవాబ్‌ మాలిక్. 


ఒక నిజాయతీ గల అధికారి అంతటి విలువైన వస్తువుల్ని ఎలా కొనుగోలు చేయగలరని మంత్రి నవాబ్‌ మాలిక్ ప్రశ్నించారు. సమీర్ వాంఖడే అక్రమంగా కొందరిని కేసుల్లో ఇరికించి, కోట్లకు పడగలెత్తారని మంత్రి నవాబ్‌ మాలిక్ (Minister Nawab Malik)అన్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ సమీర్ తిప్పికొట్టారు. తన ఖరీదైన దుస్తులు గురించి చేసిన వ్యాఖ్యలన్నీ పుకార్లు మాత్రమే అన్నారు. అలాగే డ్రగ్‌ మాఫియా (Drug Mafia).. తమ అధికారుల్ని, తన కుటుంబాన్ని ట్రాప్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని సమీర్ వాంఖడే (Sameer Wankhede) పేర్కొన్నారు.


Also Read : Badvel By Election Dasari Sudha wins: బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘన విజయం..భారీ మెజారిటీతో దాసరి సుధ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook