రోజు రోజుకీ కొందరు మనుషుల్లో హింసాత్మకమైన ప్రవర్తన ఎంతలా పెరిగిపోతుందో చెప్పే ఘటన ఇది. ముంబయిలోని చెంబూరు ప్రాంతంలో సంజూ అనే ఓ వ్యక్తి తన ఇంటికి రోజూ వచ్చే ఓ మార్జాలాన్ని స్క్రూడ్రైవర్‌తో చంపి.. తన ఇంటి దూలానికి వేలాడదీశాడు. అంతటితోనే వదలకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఫోటోలు చూడగానే యానిమల్ వెల్ఫేర్ బోర్డు్కి చెందిన నిరాలి కొరాడియా అనే ఆఫీసరు ముంబయి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ తర్వాత వారి సూచన మేరకు ఆర్సీఎఫ్ పోలీసులకు సమాచారం అందించి కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ నిరాలి మాట్లాడారు. "ఇలాంటి హింసా ప్రవర్తన కలిగి ఉన్న మనుషుల వల్ల సమాజానికి కలిగే హానీ చాలా ఎక్కువగా ఉంటుంది.


ఇటువంటి వారి వల్లే ఎన్నో విపరీత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీరికి సరైన మానసిక వైద్యం చేయించడమో లేదా తగిన రీతిలో శిక్షించడం చేయాలి. అటువంటి చట్టాలు రావాలి. అందుకు న్యాయవ్యవస్థ కూడా సహకరించాలి"అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిపై కేసును నమోదు చేసి అరెస్టు చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.