Mumbai may cross 2000 daily Covid cases today warns minister Aaditya Thackeray: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ దడ మొదలైంది. కోవిడ్ కొత్త వేరియంట్‌తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కేసుల ఉధృతి కూడా పెరుగుతోంది. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) కోవిడ్‌ కేసులపై (Covid‌ cases) ఒక ప్రకటన చేశారు. గత వారం వరకు రోజులు 150 కేసులు నమోదవుతుండగా.. ఇప్పుడు రోజుకు 2000 కేసులు (2000 cases) దాకా నమోదవుతున్నాయన్నారు. ముంబైలో ఈ రోజు 2000 కేసులు దాటే అవకాశం ఉందని చెప్పారు. 



 


కాగా ముంబైలో గత 24 గంటల్లో ఇప్పటి వరకు 1,333 కోవిడ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. అలాగే మంగళవారం మహారాష్ట్రలో కొత్తగా 2,172 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. అలాగే మొత్తం 167 ఒమిక్రాన్ కేసులు (Omicron cases) కూడా ఇక్కడ వెలుగు చూశాయి.


Also Read : Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!


ఇక తాజాగా మహా అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (Maharashtra Assembly Sessions) సాధారణంగా నాగ్‌పూర్‌లో జరుగుతుంటాయి. కోవిడ్ ఎఫెక్ట్‌ వల్ల ఈసారి ముంబైలో నిర్వహించారు. డిసెంబర్ 22న ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. ఈ 5 రోజుల్లో సమావేశాల వల్ల మొత్తం 50 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో ఇద్దరు మంత్రులున్నారు. అసెంబ్లీ పని చేసే ఉద్యోగులు, భద్రత సిబ్బంది, పోలీసులలు కరోనా (Corona) బారినపడ్డారు. మహారాష్ట్రలో కరోనా కేసులతో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ (Omicron variant) కేసులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడ ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై (New Year celebrations) ఆంక్షలు విధించారు.


Also Read : Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం..  జనవరి 26 నుండి అమల్లోకి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook