AR Rahaman Counter to Amit Shah: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్... ఇలా అన్నింట్లోనూ బీజేపీ ఏకసూత్రాన్ని జపిస్తోంది. ఇదే క్రమంలో 'ఒకే దేశం ఒకే భాష' నినాదాన్ని కూడా బీజేపీ ముందుకు తీసుకొస్తోంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో హిందీ భాష దోహదపడుతుందని చెబుతోంది. ఇదే అంశంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అమిత్ షా వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో 'తమిళ తల్లి' ఫోటోను షేర్ చేసిన రెహమాన్... 'ప్రియమైన తమిళం మన ఉనికికి మూలం' అనే వాక్యాన్ని ఆ పోస్టుకు జోడించారు. తమిళ కవి భారతీ దాసన్ 'తమిళియక్కమ్' కవితా సంకలనంలోని లైన్ అది. అమిత్ షా 'హిందీ' కామెంట్స్‌ను వ్యతిరేకిస్తూ రెహమాన్ ఈ పోస్టుతో కౌంటర్ ఇచ్చినట్లయింది.


అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా భగ్గుమంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ సిద్ధారామయ్య మాట్లాడుతూ... హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దడం సాంస్కృతిక ఉగ్రవాదమని మండిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ... అమిత్ షా వ్యాఖ్యలు దేశ ఐక్యతపై దాడిగా అభివర్ణించారు. దేశ బహుళత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందన్నారు. 


ఇంతకీ అమిత్ షా ఏమన్నారు.. :


దేశ ఐక్యతకు హిందీ భాష దోహదపడుతుందని... ప్రభుత్వాన్ని నడిపే మాద్యమమే అధికార భాషగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. తద్వారా హిందీ భాషకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. అది దేశ ఐక్యతకు దోహదపడుతుందన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాల వ్యక్తులతో మాట్లాడినప్పుడు హిందీలోనే మాట్లాడాలన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 



Also Read: Ranbir Alia Wedding Date: రణ్ బీర్, అలియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేడుకకు తరలిరానున్న బాలీవుడ్ ప్రముఖులు!


Also Read: Mannava Balayya Passes Away: సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత.. పుట్టినరోజునే మృతి!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook