Ranbir Alia Wedding Date: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇదే విషయమై ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అతిత్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుందని బాలీవుడ్ లో ఊహాగానాలు పెరిగిపోయాయి. దానికి తోడుగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి తేదీ విషయంలో మాత్రం ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 14 లేదా 15న రణ్ బీర్, అలియా పెళ్లి జరగనుందని చర్చ జరుగుతున్నా.. పెళ్లి తేదీపై స్పష్టత రాలేదు. ఇప్పుడిదే విషయమై అలియా భట్ మామ ధ్రువీకరించారు.
హీరోయిన్ అలియా భట్ మేనమామ, రచయిత రాబిన్ భట్ ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్, అలియా పెళ్లి గురించి ప్రస్తావించారు. అలియా భట్, రణ్ బీర్ కపూర్ ల పెళ్లి నాలుగు రోజుల పాటు జరగనుందని సమాచారమిచ్చారు.
ఏప్రిల్ 13న మెహందీ వేడుక జరగనుందని రాబిన్ భట్ తెలిపారు. ఆ తర్వాత రోజున వివాహం జరగనుందని.. ఈ వేడుకకు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పారు. బాంద్రాలోని రణ్ బీర్ కపూర్ నివాసంలో ఈ పెళ్లి వేడుక జరగనుందని సమాచారం.
పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు..
జాతీయ మీడియా సంస్థల నివేదిక ప్రకారం.. రణ్ బీర్ కపూర్, అలియా భట్ వివాహానికి బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, షారుక్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, ఆకాంక్ష రంజన్, అనుష్క రంజన్, రోహిత్ ధావన్, వరుణ్ ధావన్, జోయాతో సహా పలువురు హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత రణ్ బీర్, అలియా భట్.. హనీమూన్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్నారని సమాచారం.
Also Read: Acharya Pre-Release Date: ఆచార్య మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్యఅతిథిగా పవన్ స్టార్?
Also Read: Mannava Balayya Passes Away: సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత.. పుట్టినరోజునే మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook