Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే
Terror attack on Assam Rifles: మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ఉగ్రదాడికి కొద్ది గంటల ముందు జవాన్ సుమన్ స్వర్గియరీ తన భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. కొడుకు బర్త్ డేకి ఇంటికి వస్తున్నట్లు భార్యతో చెప్పాడు.
Terror attack on Assam Rifles: అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు (Terrorists) జరిపిన దాడిలో జవాన్ సుమన్ స్వర్గియరీ అమరుడవడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ దాడికి కొద్ది గంటల ముందు సుమన్ స్వర్గియరీ తన భార్య జురీ స్వర్గియరీతో ఫోన్‌లో మాట్లాడాడు. డిసెంబర్‌లో కొడుకు బర్త్ డేకి ఇంటికొస్తున్నానని చెప్పడంతో కుటుంబమంతా సంతోషించారు. కానీ ఇంతలోనే ఉగ్రదాడిలో (Terror attack) సుమన్ అమరుడైనట్లు తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ తిన్నది.
చివరిసారిగా సుమన్ తనతో ఫోన్‌లో చెప్పిన ముచ్చట్లు గుర్తు తెచ్చుకుని ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 'సుమన్ చివరిసారిగా ఈ ఏడాది జులై 8న ఇంటికి వచ్చాడు. తిరిగి 15వ తేదీన డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆయన చనిపోయిన రోజు ఉదయం నాతో ఫోన్‌లో మాట్లాడాడు. మా కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. ఎలాగూ డిసెంబర్‌లో ఇంటికొస్తున్నారు కదా... వచ్చాక వివరంగా మాట్లాడుకుందామని ఆయనతో చెప్పాను. కొడుకు బర్త్ డేకి (Birthday) తప్పకుండా వస్తానని ప్రామిస్ చేశారు.' అని జురీ స్వర్గియరీ కన్నీటి పర్యంతమయ్యారు. తాను డ్యూటీ నుంచి రిటర్న్ అవుతున్నానని.. మళ్లీ ఫోన్ (Phone call) చేస్తానని చెప్పిన తన భర్త ఇక మళ్లీ చేయలేదని జురీ తెలిపారు.
Also Read:Amit Shah: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై అమిత్ షా ప్రశంసల వర్షం
'సుమన్ తండ్రిని ఉగ్రవాదులే (Terrorists) హత్య చేశారు. అప్పటి నుంచి అతన్ని, అతని ఇద్దరు చెల్లెళ్లని కూలీ పనిచేస్తూ పెంచాను. మా ఆశలన్నీ సుమన్ పైనే పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు సుమన్ కూడా తన తండ్రి వద్దకే వెళ్లిపోయాడు. ఇక మాకే దిక్కు లేకుండా పోయింది. డిసెంబర్‌లో వస్తానని చెప్పాడు... ఇప్పుడతని మృతదేహం తిరిగొచ్చింది.' అని సుమన్ స్వర్గియరీ అంకుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read:Patan Girl Tonsured: ప్రేమికుడితో వెళ్లిపోయిన బాలికకు గుండుకొట్టించిన గ్రామస్థులు
సుమన్ స్వస్థలం అసోంలోని (Assam) బక్సా జిల్లాలో ఉన్న థెకెరాకుచి గ్రామం. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి స్థానిక శాంతి చర్చల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 2007లో ఉగ్రవాదులు ఆయన్ను హత్య చేశారు. ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తండ్రి చనిపోయిన నాలుగేళ్లకు సుమన్ 2011లో అసోం రైఫిల్స్‌లో చేరారు. శనివారం మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమన్ సహా ఏడుగురు మృతి చెందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe