Patan Girl Tonsured: ప్రేమికుడితో వెళ్లిపోయిన బాలికకు గుండుకొట్టించిన గ్రామస్థులు

Patan Girl Tonsured: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. గుజరాజ్ లోని పటాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో 35 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 03:12 PM IST
Patan Girl Tonsured: ప్రేమికుడితో వెళ్లిపోయిన బాలికకు గుండుకొట్టించిన గ్రామస్థులు

Patan Girl Tonsured: గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న కారణంతో 14 ఏళ్ల బాలికను గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. బాలికను ప్రేమించిన వ్యక్తిపైనా ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

“బాలిక చర్యల వల్ల తమ తెగకు చెడ్డ పేరు వచ్చిందని.. ఆమెను ‘శుద్ధి’ చేసేందుకే ఈ శిక్ష విధించాం’’ అని ‘వాడి’ తెగకు చెందిన గిరిజనులు పేర్కొన్నారు. అనంతరం వారి వర్గానికి చెందిన మరో వ్యక్తికి బాలికను ఇచ్చి వివాహం జరిపించారు. నవంబరు 10న హారిజ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈ వ్యవహారంలో 35 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. బాలిక ప్రేమించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అపహరించి అత్యాచారం చేశాడని అధికారులు వెల్లడించారు. 

Also Read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు!

Also Read: Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్... 8 మంది మావోయిస్టులు మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News