National Education Day 2022: జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..ఆజాద్ చేసిన కృషి ఏమిటి..?
National Education Day 2022: దేశంలోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు, ప్రముఖ విద్యావేత్త అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని భారత దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు.
National Education Day 2022: విద్యలేని వాడు వింతపశువే అనే సూక్తి అందరికీ తెలిసిందే. విద్యాతోనే మనిషి అభివృద్ధి చెందుతాడు. అయితే ప్రతి సంవత్సరం భారత్ వ్యాప్తంగా నవంబర్ 11వ తేదినా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు గుర్తుగా ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటారు. కలాం గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు, ప్రముఖ విద్యావేత్త. ఆయన జయంతిని గుర్తు చేసుకుంటూ విద్య ప్రముఖ్యతను దేశమంతటా ప్రచారాలు చేపడతారు. స్వాతంత్య్రానంతరం, దేశ నిర్మాణంలో, దేశాభివృద్ధిలో మంచి విద్య ఎంత ముఖ్యమో ఆజాద్ స్వాతంత్ర్య క్రమంలో జనాలకు తెలిపారు. దేశంలో ఆధునిక విద్యా విధానాన్ని తీసుకురావడానికి కలాం తన వంతు కృషి చేశారు. భారత జాతి విద్యా విధానంలో ఎన్నో సేవలందించారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రకటించింది. అప్పటి నుంచి దేశ వ్యా ప్తంగా విద్యా సంస్థలలో నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది.
విద్యా మంత్రిత్వ శాఖ 1951లో ఆజాద్ నాయకత్వంలో దేశంలోనే మొదటి ఐఐటీని స్థాపించింది. దీని తర్వాత 1953లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఈ సంస్థలు భారతదేశంలోని ఉన్నత విద్యా రంగంలో ముఖ్యమైనవిగా ఆజాద్ భావించి వీటి నిర్మాణానికి తన వంతు కృషి చేశారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఆయన హయాంలో ఏర్పాటు చేశారు. దేశంలో ఎంతో ప్రసిద్ధి కలిగిన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున విద్యార్థులకు.. ఉపాధ్యాయులు అక్షరాస్యత ప్రాముఖ్యత గురించి ప్రచారాలు చేస్తారు. అంతేకాకుండా పలు పోటీలను కూడా నిర్వహిస్తారు. కొన్ని పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. వివిధ పాఠశాలల్లో వ్యాసరచన, ప్రసంగం, పోస్టర్ల తయారీ పోటీలు నిర్వహిస్తున్నారు.
జాతీయ విద్యా దినోత్సవం 2022 థీమ్:
ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవం థీమ్ మారుతుంది. ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవం థీమ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. అయితే ఈ సంవత్సరం " కోర్సులను అభివృద్ధి చేయడం.. విద్యను అభివృద్ధి చేయడం" అనే థీమ్ కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది.
Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం
Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook