Nationa Herald Case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు నేతలు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈ నెల 8న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆదేశించినట్లు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. అయితే రాహుల్ గాంధీని సోనియా గాంధీ కన్నా ముందే విచారణకు రావాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేంటీ నేషనల్ హెరాల్డ్ కేసు :


నేషనల్ హెరాల్డ్ పత్రికను దివంగత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. ఇందులో నెహ్రూతో పాటు 5000 మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ అయిన ఈ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) ఆధ్వర్యంలో నడిచేది. నష్టాల కారణంగా 2008లో పత్రిక మూతపడింది. పత్రిక మూతపడే నాటికి ఇందులో వాటాదారుల సంఖ్య 1000కి తగ్గింది.


మూతపడిన నేషనల్ హెరాల్డ్ ప్రతికను తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. అయినప్పటికీ ఆ పత్రిక పునరుద్ధరించబడలేదు. పైగా ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ.90 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ రూ.90 కోట్లు అప్పు సోనియా, రాహుల్‌లకు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)‌కు బదలాయించబడింది. అంత అప్పు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఏజెఎల్ అప్పులకు బదులు సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్‌కు బదలాయించింది. ఇందుకు గాను వైఐఎల్ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించింది.


అలా ఏజెఎల్ వాటా మొత్తాన్ని వైఐఎల్‌కు బదలాయించడం ద్వారా ఆ సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వైఐఎల్ సొంతమయ్యాయి. ఏజెఎల్‌లో మిగతా వాటాదారులను విస్మరించి ఏకపక్షంగా ఈ వ్యవహారం జరగడం... కేవలం రూ.90 కోట్ల అప్పుకు సంస్థ ఆస్తులన్నీ బదలాయించడం.. ఇదంతా చట్ట విరుద్దంగా జరిగిన వ్యవహారమనే ఆరోపణలున్నాయి. దీనిపై 2012లో సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏజెఎల్-వైఐఎల్ మధ్య జరిగిన వ్యవహారంలో సోనియా, రాహుల్‌లు పెద్ద మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు, ఓ రాజకీయ పార్టీ పబ్లికేషన్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇదే కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ సోనియా, రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.


Also Read: Supreme Court: రుషి కొండ నిర్మాణాలకు రైట్ రైట్..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!


Also Read : Global Day of Parents 2022: నేడు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం... ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత, ఈసారి థీమ్ ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook