న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోగానీ, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో గానీ ఓలా క్యాబ్ సర్వీస్‌లను బుక్ చేసుకొనేందుకు వీలుగా ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఆరు నెలల పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రయాణీకులు ఈ-ప్లాట్ ఫాంలలో ఓలా క్యాబ్ బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓలా మైక్రో, ఓలా మినీ, ఓలా ఆటో, ఓలా షేర్.. ఇలా అన్ని రకాల సర్వీసులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో అందుబాటులో ఉంటాయని, ప్రయాణీకులు వారం రోజులు ముందుగానే క్యాబ్ లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. లేదంటే రైలు రైల్వేస్టేషన్ చేరుకొనే సమయానికి బుక్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు.


ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ యాప్‌, లేదా వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి, ‘బుక్‌ ఎ క్యాబ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో మీ క్యాబ్‌ సర్వీసు బుక్‌ అయి ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే మీరు బుక్‌ చేసుకున్న క్యాబ్‌ మీ ముందు ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఓలాతో జతకట్టామని ఆర్‌సీటీసీ అధికారి చెప్పారు.