కౌన్ బనేగా క్రోర్‌పతి ( Kaun Baneg Crorepati ) సీజన్ 12 లో మొట్టమొదటి కోటీశ్వరురాలు ఎవరో తెలుసా. జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన రాంచీ నివాసి నాజియా నసీమ్ ( Nazia nasim ) కేబీసీ 12 తొలి కోటీశ్వరురాలిగా గౌరవం పొందింది. ఎవరీ నాజియా..ఏమా కధ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జార్ఘండ్ ( Jarkhand ) కు చెందిన నాజియా నసీమ్ ప్రస్తుతానికి ఢిల్లీలో ఉద్యోగం చేస్తోంది. గురుగ్రామ్ లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ లో గ్రూప్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఆమెకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్‌లో సోనీ ఛానెల్ ( Sony Channel ) కేబీసీ ప్రోమోను ( KBC promo )  వీడియో షేర్ చేసింది. నాజియా నసీమ్ కోటి రూపాయలు గెల్చుకోవడం ద్వారా తొలి కోటీశ్వరురాలిగా ( First crorepati ) నమోదైందని వీడియోలో చూపించారు. అయితే 7 కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతుందా లేదా అనేది స్పష్టంగా చూపించలేదు. కోటి రూపాయలు మాత్రం గెల్చుకుందని వీడియోలో తెలిసింది. 


సోనీ కంపెనీ తన సోషల్ మీడియాలో 35 సెకన్ల వీడియా షేర్ చేసింది. ఇందులో నాజియా నసీమ్ కోటి రూపాయలు గెల్చుకున్నట్టుగా అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachan ) ప్రకటిస్తున్నారు. నాజియా అద్భుతంగా ఆడారని..మీరు ఊహించింది సరైందిగా తేలిందని అంటున్నారు ఆ వీడియోలో.  


నాజియా నసీమ్ తన విజయానికి కారణం పూర్తిగా తన భర్త, కుటుంబమైనని చెప్పారు. సాధారణంగా మహిళలు పెళ్లైన అనంతరం పని చేయలేరని అంటారని..అయితే తన భర్త ప్రోత్సాహం అధికంగా ఉందని నాజియా నసీమ్ తెలిపారు. 


నాజియా నసీమ్ ముంబాయి నుంచి రాంచీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నప్పుడు ఆమెకు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ ..నాజియాను స్వాగతం తెలిపారు. కోటి రూపాయల్ని ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదని..డబ్బులు అందిన తరువాత ఆలోచిస్తానని ఎయిర్ పోర్ట్ లో నాజియా నసీమ్ వెల్లడించింది. Also read: Supreme court: అర్నబ్ గోస్వామికు బెయిల్ మంజూరు, కోర్టులో ఏం జరిగిందో తెలుసా