Sharad pawar: శరద్ పవార్‌కు అనారోగ్యం, ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో త్వరలో శస్త్ర చికిత్స
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో శరద్ పవార్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో శరద్ పవార్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
ఎన్‌సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ (Sharad Pawar) అనారోగ్యానికి గురయ్యారు. ఆయన అనారోగ్యం, చికిత్సకు సంబంధించి పార్టీ అధికారికంగా ప్రకటన వెలువరించింది. శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరనున్నారు. హోం మంత్రి అమిత్ షా(Amit shah)తో శరద్ పవార్ రహస్య మంతనాలు జరిపారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆయన అనారోగ్యం వార్త శ్రేణుల్లో ఆందోళన నింపింది. అటు ఎన్‌సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ కూడా శరద్‌పవార్ అనారోగ్యం వివరాలపై ట్వీట్ చేశారు.
స్వల్పంగా కడుపునొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి( Breach candy Hospital)లో పరీక్షలు నిర్వహించగా, పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టుగా తేలిందన్నారు. దీంతో తదుపరి సమాచారం అందించేంత వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్టు మాలిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బ్లడ్ థిన్నర్ మందులు వాడుతున్నారు. మార్చ్ 31న ఆసుపత్రిలో చేర్పించి..తదుపరి శస్త్ర చికిత్స చేయనున్నారు. ఎండోస్కోపీ , అనంతరం శస్త్రచికిత్స జరగనుందని వెల్లడించారు.
ఈ మధ్య కాలంలో హోం మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య కీలక భేటీ జరిగిందంటూ మీడియాలో వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎన్‌సీపీ (NCP) ఖండించింది. అలాంటిదేమీలేదని, ఇదంతా బీజేపీ (BJP)రాజకీయ ఎత్తుగడలో భాగమని కొట్టి పారేసింది. అటు ఈ వ్యవహారంపై అమిత్ షా (Amit shah)ను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయలేమంటూ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ ఇప్పటికే క్యాన్సర్ బారినపడి కోలుకున్నారు.
Also read: Coronavirus: కోరలు చాస్తోన్న కరోనా వైరస్, పెరుగుతున్న కేసుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook