నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ ( National Eligibility cum Entrance Test ) ( NEET 2020 ) నీట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( National Testing Agency ) నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలు గత వారంలోనే విడుదల కావల్సి ఉన్నాకొన్ని కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్దిసేపటి క్రితం నీట్ 2020 ( NEET 2020 ) పరీక్ష ఫలితాలు దేశవ్యాప్తంగా విడుదలయ్యాయి. కోవిడ్ కారణంగా పరీక్ష మిస్సైనవారికి రెండ్రోజుల క్రితం అంటే అక్టోబర్ 14న మరోసారి పరీక్ష నిర్వహించారు. కోవిడ్ వైరస్ సోకడం లేదా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్న కారణంగా కొంతమంది విద్యార్ధులు సెప్టెంబర్ 13న నిర్వహించిన నీట్ పరీక్ష రాయలేకపోయారు. ఇలాంటి విద్యార్దుల కోసం కోర్టు ఆదేశాలతో అక్టోబర్ 14న మరోసారి నిర్వహించారు. 


నీట్ పరీక్ష ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ ( Official website )  ntaneet.nic.in కు వెళ్లి అభ్యర్దులు తమ తమ రిజల్ట్స్ ను చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 16న అంటే ఇవాళ నీట్ పరీక్ష ఫలితాల్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ముందుగానే ( Central minister Ramesh Pokhriyal ) స్పష్టం చేశారు. విద్యార్దులందరికీ శుభాకాంక్షలు కూడా తెలిపారు. 
ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్ధులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష కోసం 3 వేల 8 వందల కంటే ఎక్కువ పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు 90 శాతం అభ్యర్ధులు పరీక్షలు హాజరయ్యారు. కోవిడ్ 19 నిబంధనల మధ్య నీట్ పరీక్షను నిర్వహించారు. ఇక ఈసారి నీట్ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 13 ఎయిమ్స్ లతో పాటు జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ - పుదుచ్చేరిలో కూడా ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశాలు జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమీషన్ చట్టంలో కూడా మార్పులు చేశారు.
 


నీట్ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.in ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ నెంబర్ తదితర వివరాల్ని పొందుపర్చి ఫలితాల్ని చూసుకోండి. Also read: Yogeshwar Dutt: బరోడా బీజేపీ అభ్యర్థిగా రెజ్లర్ యోగేశ్వర్ దత్