Yogeshwar Dutt BJP candidate for Baroda By Elections: న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) నుంచి పోటీచేయనున్నారు. హర్యానా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ బరోడా నియోజకవర్గానికి ఒలింపియన్ యోగేశ్వర్ దత్ (Yogeshwar Dutt) పేరును ఖరారు చేసింది. హర్యానాలోని సోనిపట్ జిల్లా బరోడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా యోగేశ్వర్ దత్‌ను నిలబెట్టనున్నట్లు శుక్రవారం ఉదయం పేర్కొంది. నవంబరు 3 వతేదీన జరగనున్న ఈ ఉప ఎన్నిక కోసం యోగేశ్వర్ దత్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించనున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగేశ్వర్ దత్‌పై విజయం సాధించిన శ్రీ క్రిషన్ హుడా మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది.
BJP fields wrestler Yogeshwar Dutt as the party's candidate from Baroda assembly constituency for the upcoming by-election to Haryana legislative assembly. pic.twitter.com/ktgn2zy0tR
— ANI (@ANI) October 15, 2020
ఇదిలాఉంటే.. గురువారం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) ను హర్యానాకు చెందిన ప్రముఖ క్రీడాకారులు బబితా ఫొగట్, సాక్షిమాలిక్, గీతా ఫొగట్, యోగేశ్వర్ దత్ కలిశారు. ప్రస్తుతం జరిగే బరోడా ఉప ఎన్నికల్లో (baroda by elections) బీజేపీ నుంచి యోగేశ్వర్ దత్‌కు అవకాశమివ్వాలని క్రీడాకారులంతా సీఎంను అభ్యర్థించారు. ఈ విషయాన్ని జాతీయ పార్టీకు తెలియజేసిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని సీఎం క్రీడాకారులతో పేర్కొన్నారు. జాతీయ నాయకత్వంతో చర్చించిన అనంతరం యోగేశ్వర్ దత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు
ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ హర్యానా సోనిపట్ జిల్లాలోని భైంసావల్ కలాన్ గ్రామానికి చెందిన వారు. యోగశ్వర్ దత్ 2019లో రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదిలాఉంటే.. యోగేశ్వర్ దత్ 2012లో ఒలింపక్ పతకం సాధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2013లో పద్మశ్రీ అవార్డుతో దత్‌ను సత్కరించింది. అంతేకాకుండా 2014లో కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం కూడా సాధించారు. Also read: Annapurna Studios Fire accident: అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం.. Video
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe