NEET Answer Key 2022: నీట్ అధికారిక ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్స్ విడుదల, ఎలా,, ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
NEET Answer Key 2022: నీట్ 2022 పరీక్షా ఫలితాల సందడి ప్రారంభమైపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా సమాధానాల కీ, ఓఎంఆర్ షీట్స్ విడుదల చేసింది. దీనికి సంబంధించి లింక్స్ కూడా షేర్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
NEET Answer Key 2022: నీట్ 2022 పరీక్షా ఫలితాల సందడి ప్రారంభమైపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా సమాధానాల కీ, ఓఎంఆర్ షీట్స్ విడుదల చేసింది. దీనికి సంబంధించి లింక్స్ కూడా షేర్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
అభ్యర్ధులు ఎదురు చూస్తున్న NEET Answer Key 2022 విడుదలైంది. కీ తో పాటు ఓఎంఆర్ షీట్స్ కూడా విడుల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దాంతో అప్పుడే విద్యాసంస్థలు.. కీ , ఓఎంఆర్ షీట్స్ చెక్ చేసుకుని వచ్చిన మార్కుల ఆధారంగా ప్రచారం ప్రారంభించేశారు. అదే సమయంలో కీ, ఓఎంఆర్ షీట్లపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు అధికారిక లింక్ neet.nta.nic.in. జారీ చేసింది.
అభ్యర్ధులు తమ ఆన్సర్ కీను neet.nta.nic.in. నుంచి తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతో పాటు ఓఎంఆర్ షీట్స్ కాపీలు కూడా అందుబాటులో ఉంచింది ఎన్‌టిఏ.
అధికారికంగా నీట్ 2022 ఫలితాలు సెప్టెంబర్ 7న విడుదల కానున్నాయి. ఫలితాలు కూడా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in. లో అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో నీట్ కట్ ఆఫ్ స్కోర్స్ కూడా విడుదల చేస్తుంది. కట్ ఆఫ్ స్కోర్స్ ఆధారంగానే స్టేట్ అండ్ సెంట్రల్ ఏజన్సీలు మెరిట్ జాబితా సిద్ధం చేస్తాయి.
ఇప్పుడు ఎన్‌టీఏ అధికారికంగా విడుదల చేసిన ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్స్ ఆధారంగా ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బెంగళూరు దాసరహళ్లిలోని ఒక బ్రాంచ్ తమకొచ్చిన మార్కుల్ని షేర్ చేసింది. ఇందులో అత్యధికంగా 720కు 705 మార్కులు వచ్చినట్టుగా ఉంది. మరో విద్యార్ధికి 700 మార్కులు వచ్చాయి.
[[{"fid":"243615","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"నీట్ ఆన్సర్ కీ విడుదల","field_file_image_title_text[und][0][value]":"నీట్ ఆన్సర్ కీ విడుదల"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"నీట్ ఆన్సర్ కీ విడుదల","field_file_image_title_text[und][0][value]":"నీట్ ఆన్సర్ కీ విడుదల"}},"link_text":false,"attributes":{"alt":"నీట్ ఆన్సర్ కీ విడుదల","title":"నీట్ ఆన్సర్ కీ విడుదల","class":"media-element file-default","data-delta":"3"}}]]
సెప్టెంబర్ 7న విడుదల కానున్న నీట్ 2022 ఫలితాల కోసం అధికారికంగా మూడు సైట్స్ neet.nta.nic.in , nta.ac.in , ntaresults.nic.in అందుబాటులో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook