NEET PG 2021 Admissi‌ons: దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పీజీ మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ ఇలా ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ లేదా పీజీ మెడిసిన్ వైద్య విద్యలో అడ్మిషన్‌కు జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష అంటే నీట్‌లో అర్హత తప్పనిసరి. NEET PG 2021కు సంబంధించి అంటే ఈ ఏడాది పీజీ మెడిసిన్ అడ్మిషన్ల ప్రక్రియకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పీజీ నీట్ 2021లో అర్హత పొందిన విద్యార్ధులు ఈ నెల 25 నుంచి జరిగే కౌన్సిలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ , ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 25 నుంచి 29వ తేదీవరకూ జరగనుంది.రెండవ దశ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 15 నుంచి 19వ తేదీ వరకూ ఉంటుంది. ఇక మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్ 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఫలితాలు నవంబర్ 3న విడుదలవుతాయి. 


రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల భర్తీకై కౌన్సిలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సిలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీ సీట్లు, పీజీ డీఎన్‌బీ సీట్ల ప్రవేశం కోసం అదనపు రౌండ్ ఉంటుంది. మిగిలిన సీట్ల కోసం చివరిలో మరో రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. 


Also read: AP Municipal Elections: ఏపీలో మరోసారి మినీ మున్సిపల్ సంగ్రామం, నవంబర్‌లో ఎన్నికలకు కసరత్తు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook