NEET PG 2023 Results: దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ విద్య అడ్మిషన్లకై ఏటా నిర్వహించే నీట్ 2023 మార్చ్ 5న జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్ని నేషనల్ బోర్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేయగా..ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://natboard.edu.in/, https://nbe.edu.in లో అందుబాటులో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎండీ, ఎంఎస్, పీజి డిప్లొమా, డీఎన్‌బి కోర్సుల్లో ప్రవేశానికై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ మార్చ్ 5న నిర్వహించిన నీట్ పీజీ 2023 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. నీట్ పీజీ పరీక్ష 2023 మార్చ్ 5న జరిగింది. నీట్ పీజీ పరీక్షను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేసినందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ప్రశంసించారు. మార్చ్ 25 నుంచి నీట్ పీజీ స్కోర్ కార్డులు అందుబాటులో ఉంటాయి.


కటాఫ్ మార్క్ ఎంత


ఈసారి నీటి పీజీ కటాఫ్ మార్క్స్‌ను జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగరీకు 291 మార్కుల కటాప్ నిర్ణయించగా, జనరల్ పీడబ్ల్యూడీ కేటగరీకు 274 మార్కులు, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ కేటగరీకు 257 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. నీట్ పీజీ పరీక్ష మొత్తం 800 మార్కులకు ఉంటుంది. మార్చ్ 5వ తేదీన జరిగిన నీట్ పీజీ 2023 పరీక్షకు 2 లక్షలకు పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. నీట్ పీజీ పరీక్షా ఫలితాల్ని సంబంధిత వెబ్‌సైట్స్ https://natboard.edu.in/, https://nbe.edu.in లో అందుబాటులో ఉన్నాయి. 


ఇక గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే గేట్ 2023 పరీక్ష ఫలితాలు మార్చ్ 16 అంటే రేపు విడుదల కానున్నాయి. ఈ పరీక్షను ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6,12,13 తేదీల్లో నిర్వహించగా ఫిబ్రవరి 21వ తేదీన కీ విడుదల చేశారు. మార్చ్ 21 నుంచి స్కోర్ కార్డులు అందుబాటులో ఉంటాయి.


Also read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook