NEET PG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ పరీక్ష ప్రతి యేటా రెండు విభాగాల్లో జరుగుతుంటుంది. ఒకటి ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి రెండవది పీజీలో ప్రవేశానికి. నీట్ పీజీ 2024 పరీక్ష మార్చ్ 3న జరగాల్సింది వాయిదా పడింది. నీట్ పీజీ పరీక్షకు ఎవరు అర్హులో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ పీజీ 2024 పరీక్ష మార్చ్ 3వ తేదీన ఉంటుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గత ఏడాది నవంబర్ 9వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పుడిక అమల్లో లేదు. నీట్ పీజీ 2024 పరీక్షను జూలై 7కు వాయిదా వేస్తూ NBEMS తెలిపింది. కచ్చితమైన తేదీని త్వరలో NBEMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియనుంది. నీట్ పీజీ 2024 పరీక్ష అప్లికేషన్లు, ఇన్‌ఫర్మేషన్ బులెటిన్, ఇతర వివరాలను natboard.edu.in ద్వారా తెలుసుకోవచ్చు. 


దేశంలో వైద్యంలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ పరీక్షలో ఉత్తీర్ణత చెందాల్సి ఉంటుంది. వాస్తవానికి నీట్ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అమల్లోకి రానుంది. అప్పటి వరకూ నీట్ పీజీ పరీక్ష యధావిధిగా జరుగుతుంది. ఆగస్టు 15 నాటికి లేదా అంతకంటే ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఎంబీబీఎస్ విద్యార్ధులు నీట్ పీజీ రాయవచ్చు. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది నీట్ పీజీ, ఎఫ్ఎంజీఈ పరీక్షల స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆధునిక వైద్య విద్యలో ప్రవేశానికి, ఇండియాలో ప్రాక్టీసు చేయాలనుకునే విదేశీ వైద్య విద్యార్ధులకు స్క్రీనింగ్ పరీక్ష లాంటిది. 


నీట్ పీజీ 2024 పరీక్షను మార్చ్ 3 న నిర్వహించేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వెనక్కి తీసుకుంది. ఇప్పుడు జూలై 7 వతేదీ కూడా ప్రతిపాదిత తేదీనే. కచ్చితమైన తేదీ త్వరలో వెల్లడి కానుంది. 


Also read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు, ఎక్కడెక్కడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook