NEET PG exams 2021 postponed: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
NEET PG exams 2021 postponed, NEET PG exams 2021 new dates will be declared later: న్యూఢిల్లీ: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యువ డాక్టర్లను దృష్టిలో పెట్టుకునే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
NEET PG exams 2021 postponed, NEET PG exams 2021 new dates will be declared later: న్యూఢిల్లీ: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యువ డాక్టర్లను దృష్టిలో పెట్టుకునే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న నీట్ పీజీ పరీక్షలు జరగాల్సి ఉండేది. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ పీజీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని కేంద్ర మంత్రి డా హర్షవర్థన్ స్పష్టంచేశారు.
అంతకంటే ముందుగా నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ పరీక్షలకు తమ పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడం కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణమైంది. NEET PG 2021 exam కోసం 1,74,886 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే చాలా మంది తమ అడ్మిట్ కార్డులు కూడా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
Also read : Telangana Examinations 2021: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్ పరీక్షలు వాయిదా
CBSE 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు కాగా CBSE 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలు కూడా సీబీఎస్ఈ పరీక్షలు తరహాలోనే వాయిదా వేయాలని నీట్ పీజీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పట్టుబడుతూ వచ్చారు. కేంద్రం కూడా వారి డిమాండ్‌కి ఓకే చెప్పింది.
ఇదిలావుంటే, CBSE Board exams 2021 తరహాలోనే కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ కూడా సీఐఎస్‌సీఈ బోర్డు పరీక్షల (CISCE board exams) విషయంలో నిర్ణయం తీసుకుంటుందేమోనని CISCE students ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఐఎస్సీఈ కూడా ప్రస్తుత కొవిడ్-19 (COVID-19 cases) పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నీట్ పీజీ పరీక్షలు, ఇదివరకు సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడిన తీరు చూస్తోంటే.. ఏ క్షణమైనా సీఐఎస్ఈ పరీక్షలపై కూడా కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read : COVID-19: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా మరణాలు, తాజాగా 3,307 కోవిడ్19 కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook