Telangana Examinations 2021: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. భారీగా కేసులు నమోదవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona second wave) విపరీతంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తెలంగాణలో గత 24 గంటల్లో 3 వేల 5 వందల వరకూ కొత్త కేసులు నమోదు కాగా..ఏపీలో ఏకంగా 5 వేల పై చిలుకు కేసులు వెలుగుచూశాయి.ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు (1oth class exams cancelled) చేయాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్ పరీక్షలను (Inter Examinations)వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ తీవ్రత వేళ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం ( Telangana government) మొగ్గు చూపింది. గత ఏడాది కూడా కరోనా వైరస్ దృష్ట్యా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల్ని రద్దు చేశాయి.
కాగా, రాష్ట్రంలో దాదాపు 5.35 లక్షల మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ పంపింది. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana cm kcr) ఇప్పటికే సంతకం చేసినట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి.
Also read: Telangana Municipal Elections 2021: 5 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook