NEET Result 2020 Date: నీట్ 2020 ఫలితాలు వాయిదా.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టు భారీ ట్విస్ట్
NEET Result 2020 Live Updates | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు విడుదల వాయిదా (NEET Result 2020 on October 16) పడింది. అక్టోబర్ 12న విడుదల కానున్న నీట్ 2020 ఫలితాల ప్రకటనను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు (NEET Result 2020 Date) విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 12న విడుదల కానున్న నీట్ 2020 ఫలితాలు ప్రకటనను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ అక్టోబరు 16వ తేదీన నీట్ 2020 ఫలితాల (NEET Result 2020 on October 16)ను వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)కి సుప్రీంకోర్టు సూచించింది. కోవిడ్-19 కారణంగా కంటైన్మెంట్ జోన్లతో పాటు, కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న కారణంగా పరీక్ష రాయలేని విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వీరికి అక్టోబరు 14న నీట్ 2020 పరీక్ష నిర్వహించాలని, ఈ 16న ఓవరాల్‌గా అందరూ అభ్యర్థుల నీట్ 2020 ఫలితాలు (NEET Result 2020)ను వెల్లడించాలని ఎన్టీఏని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష 2020 ఫలితాలు (NEET Results 2020) తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు (అక్టోబర్ 12న) విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వల్ల, కంటైన్మైంట్ జోన్లలో ఉండి పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు ఈ 14న పరీక్ష నిర్వహించి, అందరికీ ఒకేసారి ఈ 16న ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ : ntaneet.nic.in
కాగా, సెప్టెంబర్ 13న ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ 2020 పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల ఆధారంగా దేశ వ్యాప్తంగా 542 మెడికల్ కళాశాలల్లోని 80,005 సీట్లను భర్తీ చేస్తారు. 313 డెంటల్ కాలేజీలలోని 26,949 సీట్లతో పాటు ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా భర్తీ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe