NEET Result 2020: నేడే నీట్ 2020 ఫలితాలు విడుదల.. 

NEET Results 2020: దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష 2020 ఫలితాలు (NEET 2020 Results) నేడు విడుదల కానున్నాయి. ntaneet.nic.in వెబ్ సైట్లో ఈ ఫలితాలను విడుదల కానున్నాయి

Last Updated : Oct 12, 2020, 02:10 PM IST
  • నీట్ ఫలితాలు విడుదల చేయనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
  • నీట్ 2020 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు
  • ఈ ర్యాంకులతో దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలలో సీట్లు భర్తీ
NEET Result 2020: నేడే నీట్ 2020 ఫలితాలు విడుదల.. 

NEET Results 2020: దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్ 2020 ఫలితాలు (NEET Results 2020) నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నీట్ పరీక్షల ఫలితాలు (NEET 2020 Results) అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. Also Read : NEET Result 2020 Date: నీట్ 2020 ఫలితాలు వాయిదా.. చివరి నిమిషంలో సుప్రీంకోర్టు భారీ ట్విస్ట్

నీట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి

కాగా, నీట్ 2020 పరీక్షను కరోనా కారణంగా చాలా ఆలస్యంగా నిర్వహించారు. కోవిడ్19 నిబంధనలతో పటిష్ట చర్యలు, జాగ్రత్తల నడుమ సెప్టెంబర్ 13న పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 15.97 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ర్యాంకుల ఆధారంగా దేశ వ్యాప్తంగా 542 మెడికల్ కళాశాలల్లోని 80,005 సీట్లను భర్తీ చేస్తారు. 313 డెంటల్ కాలేజీలలోని 26,949 సీట్లతో పాటు ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా భర్తీ చేయనున్నారని తెలిసిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News