NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య..కానీ
ఇది కంప్యూటర్ పొరపాటా.. లేదా నీట్ ( NEET ) ఫలితాలను అప్లోడ్ చేసిన వ్యక్తుల పొరపాటో తెలియదు కానీ.. ఒక విద్యార్థిని ప్రాణాలు విడిచింది.
ఇది కంప్యూటర్ పొరపాటా.. లేదా నీట్ ( NEET ) ఫలితాలను అప్లోడ్ చేసిన వ్యక్తుల పొరపాటో తెలియదు కానీ.. ఒక విద్యార్థిని ప్రాణాలు విడిచింది. నిజానికి ఇందులో తప్పు ఎవరిదీ.. ఎవరిని నిందించాలి అనేది అర్థం కాని విషయం. నీట్ పరీక్షా ఫలితాలు ( Results ) తప్పుగా ప్రకటించడం వల్ల ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Also Read | VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!
నీట్ పరీక్షా ఫలితాలు ఈ అమ్మాయిని ఎంతగా క్షోభ పెట్టాయి అంటే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి కారణం ఆమెకు నీట్ లో ఆరు మార్కులు రావడం. అయితే అంత తక్కువ మార్కులు రావడం అనేది పొరాపాటు వల్ల జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయి మార్కులు జాబితాను చెక్ చేస్తే ఆమెకు 590 మార్కులు వచ్చాయి అని తెలిసింది.
Also Read | Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త
చిద్వారాకు చెందని విధి సూర్యవంశి ( Vidhi Suryavanshi ) చిన్నానాటి నుంచి డాక్టర్ కావాలి అనుకుంది. నీట్ పరీక్షలకు ( NEET Results 2020 ) దీక్షతో సిద్ధం అయింది. ఫలితాలు వచ్చాయి అని నెట్ లో చెక్ చేస్తే ఆరు మార్కులే కనిపించాయి. దాంతో విధి మానసికంగా బాగా డిస్టర్బ్ అయింది. అది గమనించి తల్లిదండ్రులు OMR షీట్ చూపించి నీకు 590 మార్కులు వచ్చాయి అన్నారు. అయినా కానీ అప్పటికే తీవ్రమైన మనస్తాపానికి గురైన విద్యార్థిని రెండు రోజుల క్రితం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR