VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపులు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!

VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపులు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!

Last Updated : Oct 22, 2020, 07:55 PM IST
    • వీసా ఇబ్బందుల్లో వారికి శుభవార్త.
    • కేంద్ర ప్రభుత్వం నేడు వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
    • కొన్ని అంశాలను సడలించింది.
VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపులు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!

Civil Aviation | వీసా ( Visa ) ఇబ్బందుల్లో వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నేడు వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కొన్ని అంశాలను సడలించింది. ఈ కొత్త సడలింపులో భాగంగా అన్ని వర్గాల విదేశీలయు భారత దేశానికి వచ్చేందుకు అనుమతించింది. అయితే ఇందులో ఒక కీలక అంశం అయిన పర్యాటకులకు మాత్రం దేశంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనను వెలువరించింది. ప్రస్తుతానికి అయితే OIC, PIO కార్ట్స్ ఉన్నవారిని మాత్రం అనుమతి ఇస్తున్నట్టు ఇందులో తెలిపింది.

వీసా విషయంలో భారతీయులతో ( India ) పాటు విదేశీలయులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. అయితే సివిల్ ఏవియేషన్ అనుమతించిన విమానాలకు మాత్రమే ఈ నియమాలు చెల్లుతాయి. దేశ వ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ ప్రభులుతున్నసమయంలో కేంద్రం వీసాలపై ఆంక్షలు విధించింది. అన్ లాకింగ్ ప్రక్రియలో భాగంగా సడలింపులు చేసింది.

వీసా నియమాలను ఎత్తి వేస్తూనే కోవిడ్-19 నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్, పర్యాటకుల, వైద్య వీసాలపై ఆంక్షలు కొనసాగుతాయి అని తెలిపింది. వ్యాపారం, సమావేశాలు, ఎడ్యుకేషన్, రీసెర్చ్ కోసం వీసాలను అనుమతించింది కేంద్రం.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News