NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది. ఎన్టీఏపై తీవ్ర విమర్శలు చెలరేగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా NEET PG 2024 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుండగానే ఎన్టీయే నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగుచూడటంతో మొత్తం పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్షలో కలిపిన గ్రేస్ మార్కుల్ని తొలగించి ఆ 1563 మందికి రీ నీట్ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిద్ధమైంది. మరోవైపు నీట్ 2024 పేపర్ లీక్ వ్యవహారం బీహార్‌లో బయటపడటమే కాకుండా కీలక సూత్రధారులు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. 


ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన NEET PG 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష వాయిదాతో విద్యార్ధులకు కలిగిన అసౌకర్యంపై వైద్య ఆరోగ్య శాఖ విచారం వ్యక్తం చేసింది. విద్యార్ధుల ప్రయోజనాలతో పాటు పరీక్ష ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. యూజీసీ నెట్, నీట్ యూజీ పరీక్షల నిర్వహణ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణల నేపధ్యంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త డైరెక్టర్‌గా ఐటీపీవో ఛైర్మన్ ప్రదీప్ సింగ్ ఖరోరాకు బాధ్యతలు అప్పగించింది. 


మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 10 మంది విద్యార్ధులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి త్వరగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కోరారు. బీహార్‌లో పేపర్ లీక్ వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేసేలా బీహార్ పోలీసుల్ని ఆదేశించాలని విద్యార్ధులు కోరారు. బీహార్‌లో నీట్ యూజీ 2024 పరీక్ష లీకేజ్ వ్యవహారంలో 14 మందిని అరెస్ట్ చేశారు. 


Also read: Snakes Pics: ఇండియాలో పాములెక్కువగా ఉండే రాష్ట్రమేది, ఏ పాము అత్యంత విషపూరితమైంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook