Snakes Pics: ఇండియాలో పాములెక్కువగా ఉండే రాష్ట్రమేది, ఏ పాము అత్యంత విషపూరితమైంది

పాము పేరు వింటేనే ఎవరికైనా సరే ఒళ్లు జలదరిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములున్నాయి. ఇండియాలో లక్షద్వీప్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పాములున్నాయి. అన్నింటికంటే ఎక్కువ పాములు సంచరించే రాష్ట్రమేంటో చూద్దాం.

Snakes Pics: పాము పేరు వింటేనే ఎవరికైనా సరే ఒళ్లు జలదరిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములున్నాయి. ఇండియాలో లక్షద్వీప్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పాములున్నాయి. అన్నింటికంటే ఎక్కువ పాములు సంచరించే రాష్ట్రమేంటో చూద్దాం.

1 /6

పాములు ఎక్కువగా ఎక్కడ కాటేస్తాయి వాస్తవానికి పాములు ఎక్కడైనా కాటేస్తాయి. ఎక్కడ కాటేసినా ఒకటే ప్రభావం ఉంటుంది. వాస్తవానికి మనిషి కన్పిస్తే ఇవి ముందు దాక్కునేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఆ మనిషితో ప్రమాదముందని భావిస్తే దాడి చేస్తాయి. ఎక్కువగా కాళ్లు, మడమ, చేతులు, ముఖంపై కాటేస్తుంటాయి. 

2 /6

ప్రాణాంతకమైన పాములివే ఇండియాలో కన్పించే అత్యంత విషపూరితమైన పాము వైపర్. ఇది కాటేస్తే రక్తం బ్లాక్స్‌గా మారి కాస్సేపట్లోనే ప్రాణం పోతుంది. అయితే ఇండియా అత్యధిక పాము కాటు మరణాలు మాత్రం వైపర్ వల్ల కాదు. 

3 /6

ఏ రాష్ట్రంలో ఎక్కువగా పాములు అవును...మీరు ఊహించింది నిజమే. కేరళలో దేశంలో అత్యధిక సంఖ్యలో పాములున్నాయి. ఇక్కడ ఏకంగా 350 రకాల పాములున్నాయి. కేరళలో పాముల్లేని ఊరే కన్పించదు. పాములు అత్యధికంగా ఉండటం వల్లనే వర్షాలు అధికంగా కురుస్తాయి. పాముల కారణంగానే చెట్లు, అడవులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 

4 /6

ప్రతి ఊరిలో పాములు మనదేశంలోని ఓ రాష్ట్రంలో అత్యధిక రకాల పాములున్నాయి. అందమైన ప్రకృతి, సముద్ర తీరానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది. ప్రతియేటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఊర్లో పాములు తిరుగుతూ కన్పిస్తాయి.

5 /6

పాము కాటేశాక ఎంతసేపు ప్రాణం  నిలబడుతుంది వాస్తవానికి అన్ని పాములు విషపూరితమైనవి కావు. విషపూరిత పాముల్లో కూడా విషం అన్నింట్లో ఒకేలా ఉండదు. అందుకే ఒక్కో పాము కాటు ప్రభావం ఒక్కోలా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైంది బ్లాక్ మాంబా. ఇది కాటేస్తే కేవలం 6 గంటల్లో ఆ మనిషి మరణిస్తాడు. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణం కాపాడవచ్చు.

6 /6

పాము కాటేసిన తరువాత ఏమౌతుంది ఎవరికైనా పాము కాటేస్తే మొదటి గంట అత్యంత కీలకంగా భావించాలి. ఈ సమయంలో కాటేసిన ప్రాంతంలో దురదలా ఉంటుంది. క్రమంగా గొంతు ఎండిపోతుంటుంది. కళ్లలో వెలుగు పోతుంటుంది. తల నొప్పి మొదలవుతుంది. అంటే పాము విషం క్రమంగా శరీరం మొత్తం వ్యాపిస్తుందని అర్ధం