NEET UG 2024 Hearing: నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కుల్లో అవకతవకలు, పరీక్ష నిర్వహణలో గందరగోళం వంటి అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. నీట్ పరీక్షను రద్దు చేసి రీ టెస్ట్ నిర్వహించే అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఆలోచన చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని ప్రముఖ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి అభాసుపాలైంది. గ్రేస్ మార్కుల కుంభకోణం కాస్తా పేపర్ లీకేజ్ వరకూ సాగింది. ఓ వైపు సీబీఐ దర్తాప్తు సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో భారీగా పిటీషన్లు దాఖలయ్యాయి. నీట్ పరీక్ష రద్దు చేసి రీ టెస్ట్ జరిపించాలనే డిమాండ్ కూడా న్యాయస్థానం ముందుకొచ్చింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టింది. ఇవాళ జరిగిన విచారణలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 


నీట్ పేపర్ లీకైందనేది స్పష్టమైందని కానీ ఎంతమందికి ఆ ప్రశ్నాపత్రం చేరింది, ఎంతమంది లాభపడ్డారు, ఎంతమందిని గుర్తించారు, తప్పు చేసిన వాళ్లలో ఇంకా ఎంతమందిని గుర్తించాలి, పేపర్ లీకేజ్‌తో లాభపడిన విద్యార్ధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని ఫలితాలను హోల్డ్ చేశారనే వివరాలతో సమగ్రమైన నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ఎన్టీఏను ఆదేశించింది. పేపర్ లీక్ వ్యవహారంలో లోపాల్ని పసిగట్టేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుపై ఆలోచన చేయాలని కోరింది. 


ఇది 23 లక్షలమంది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన అంశమైనందున నీట్ పరీక్ష రద్దు చేసి రీ టెస్ట్ జరిపించాలనేది చిట్ట చివరి ఆప్షన్ కావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేక నేరం చేసినవారిని గుర్తించలేకపోయినా నీట్ రీ టెస్ట్‌కు ఆదేశిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది జరిగే ముందు లీకై పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించాలని తెలిపింది. లీకైన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని నిర్దారణ జరిగినా రీ టెస్ట్‌కు ఆదేశిస్తామని కోర్టు వెల్లడించింది. గురువారానికి విచారణ వాయిదా వేసింది. 


నీట్ పేపర్ సెట్ చేసిన తరువాత ప్రింటింగ్ ప్రెస్‌కు ఎలా పంపించారు, అక్కడ్నించి పరీక్ష కేంద్రానికి ఎలా చేరాయి, ఏయే తేదీల్లో ఇది జరిగిందనే వివరాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సేకరించింది. ఒకే సెంటర్ నుంచి పేపర్ లీకైందని అఢిషనల్ సొలిసిటర్ జనరల్ చెప్పడంతో నీట్ పేపర్ లీక్ రుజువైందని కోర్టు తెలిపింది. నీట్ పరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదని ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. 


Also read: HIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook