NEET UG 2024 Re Exam: దేశవ్యాప్తంగా వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కుల వ్యవహారం వివాదాస్పదం కావడంతో 1563 మంది విద్యార్ధులకు రీ నీట్ నిర్వహించారు. కానీ ఈ పరీక్షకు సగం మందే హాజరు కావడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NEET UG 2024 Re Neet పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై మరోసారి ఆరోపణలకు కారణమైంది. మేలో జరిగిన నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో కొందరు విద్యార్ధులకు నిబందనలు వ్యతిరేకంగా 716, 718, 719 మార్కులు రావడంతో మొదలైన వివాదంతో ఎన్టీయే గ్రేస్ మార్కుల వ్యవహారం వెలుగుచూసింది. గ్రేస్ మార్కుల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కుల్ని తొలగించిన ఎన్టీఏ 1563 మంది విద్యార్ధులకు రీ నీట్ పరీక్షను నిన్న జూన్ 23న నిర్వహించింది. చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, మేఘాలయలోని కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. కానీ ఈ పరీక్షకు 750 మంది గైర్హాజరయ్యారు. 813 మంది రీ నీట్ పరీక్ష రాశారు. అంటే దాదాపు సగం మంది డుమ్మా కొట్టారు.


వాస్తవానికి మే 5న నీట్ యూజీ 2024 పరీక్ష జరిగినప్పుడు ఆరు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైందనే కారణంతో 1563 మంది విద్యార్ధులకు ఎన్టీయే గ్రేస్ మార్కులు ఇచ్చింది. దాంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 67 మందికి ఫుల్ మార్కులు రావడం, ఒకే సెంటర్ నుంచి ఉండటం ఇలా చాలా అవకతవకలు వెలుగు చూశాయి. దాంతో గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదై సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కులు తొలగించి తిరిగి రీ నీట్ నిర్వహించినప్పుడు సగం మంది డుమ్మా కొట్టడంతో ఎన్టీఏపై రేకెత్తిన ఆరోపణలకు బలం చేకూరుతోంది. 


మాల్ ప్రాక్టీస్ కారణంగా దేశవ్యాప్తంగా 63 మంది అభ్యర్ధుల్ని ఎన్టీయే డిబార్ చేసింది. ఇందులో బీహార్ నుంచి 17 మంది, గోద్రా నుంచి 30 మంది ఉన్నారు. చండీగఢ్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్ధులు పరీక్ష రాయాల్సి ఉండగా ఇద్దరూ గైర్హాజరయ్యారు. మేఘాలయ, హర్యానాల్లో అత్యధికంగా విద్యార్ధులు హాజరు కాలేదు. 


Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook