న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడు బీజేపి చీఫ్ డా తమిళిసై సౌందరరాజన్‌ నియమితులయ్యారు. కేంద్రం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా ఆ జాబితాలో తెలంగాణ గవర్నర్‌గా డా తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆసిఫ్ మొహ్మద్ ఖాన్‌, మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోష్‌యారి పేర్లు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న కల్యాణ్ సింగ్ స్థానంలోకి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇదిలావుంటే, తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఎక్కడకు బదిలీ చేయనున్నారు, ఏ  బాధ్యతలు అప్పగించనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"179673","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు ఐదేళ్ల పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలోనే భగత్ సింగ్‌ని గవర్నర్‌గా నియమించారు. తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్‌గానూ ఉన్న ఆయనకు మరేదైనా పదవి అప్పగించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే కేరళ గవర్నర్‌గా ఉన్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం ఐదేళ్ల పదవీ కాలం సైతం ముగియడంతో ఆయన స్థానంలోనే కేంద్ర మాజీ మంత్రి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ని నియమించారు.